India Vs Pakistan War: పంజాబ్‌లో విద్యుత్ సరఫరా పునరుద్దరణ
ABN , Publish Date - May 09 , 2025 | 02:23 AM
India Vs Pakistan War: పంజాబ్ రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు ప్రభుత్వం మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించింది. అలాగే పోలీసులు, భద్రతా సిబ్బంది సెలవులను సైతం పూర్తిగా రద్దు చేసింది.
చండీగఢ్, మే 09: పంజాబ్‌లోని లూథియానా, మొహాలి, చండీగఢ్‌తోపాటు జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లలో విద్యుత్ సరఫరాను ప్రభుత్వం పునరుద్దరించింది. రక్షణ శాఖ ఉన్నతాధికారులతో చర్చల అనంతరం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే కపుర్తల జిల్లాలో శుక్రవారం ఉదయం 4:00 గంటల వరకు రం విద్యుత్ సరఫరాను నిలిపివేసినట్లు జిల్లా అధికారులు వివరించారు.
భారత్, పాకిస్తాన్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ సరిహద్దును కలిగి ఉన్న పంజాబ్‌లో ముందస్తు చర్యల్లో భాగంగా విద్యుత్ సరఫరాను ప్రభుత్వం నిలిపి వేసిన సంగతి తెలిసిందే. లైట్లు స్విచ్ ఆప్ చేసి.. ఇంట్లోనే ఉండాలని ప్రజలకు ప్రభుత్వం విజ్ఞప్తి చేసిన విషయం విదితమే.
మరోవైపు జలంధర్‌లో కొన్ని డ్రోన్‌లను గుర్తించినప్పటికీ.. వాటిని భద్రతా దళాలు నిర్వీర్యం చేశాయని అధికారులు వివరించారు. పఠాన్‌కోట్ జిల్లాలో పలు చోట్ల బాంబు పేలుళ్లు సంభవించాయని తెలిపారు. ఇక మొహాలీ జిల్లా యంత్రాంగం అజిత్ సింగ్ నగర్ పరిధిని డ్రోన్‌లు, మానవరహిత వైమానిక వాహనాలు ఎగరకుండా.. నో ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించింది.
ఇంకోవైపు.. పంజాబ్ రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్లకు ప్రభుత్వం మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించింది. అలాగే పోలీసులు, భద్రతా సిబ్బంది సెలవులను సైతం పూర్తిగా రద్దు చేసింది. వివాహాది శుభకార్యక్రమాల్లో మందుగుండి సామాగ్రి కాల్చ వద్దని తీర్మానించింది. అదే విధంగా ప్రజల సౌకర్యార్థం కంట్రోల్ రూమ్‌ను సైతం ఏర్పాటు చేసినట్లు పంజాబ్ ప్రభుత్వం వెల్లడించింది.
ఇవి కూడా చదవండి..
India-Pakistan War: భారత్‌లో ఈ ఎయిర్‌పోర్టులు మూసివేత..
Operation Sindoor: జమ్ము టార్గెట్‌గా పాకిస్థాన్ డ్రోన్ దాడులు
For National News And Telugu News