India-Pakistan War: భారత్‌లో ఈ ఎయిర్‌పోర్టులు మూసివేత..
ABN , Publish Date - May 09 , 2025 | 12:10 AM
India-Pakistan War: పాక్ వరుసగా ద్రోణులతో భారత్‌పై దాడి చేస్తుంది. వాటిని భారత్ తిప్పికొడుతోంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. దీంతో దేశవ్యాప్తంగా 24 ఎయిర్ పోర్టులను మూసి వేయాలని కేంద్రం నిర్ణయించింది.
న్యూఢిల్లీ, మే 08: పాక్ వరుసగా ద్రోణులతో భారత్‌పై దాడి చేస్తుంది. వాటిని భారత్ తిప్పికొడుతోంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో భారత్‌లో దేశవ్యాప్తంగా 24 ఎయిర్‌పోర్టులను మూసి వేయాలని కేంద్రం నిర్ణయించింది.
1) ఛండీగఢ్
2) అమృత్‌సర్
3) శ్రీనగర్
4) లూథియానా
5) బుంటర్
6) కిషన్ గఢ్
7) పాటియాల
8) సిమ్లా
9) కాంగ్రా గగల్
10) బటిండా
11) జైసల్మేర్
12) జోధ్‌పూర్
13) బికనీర్
14) హల్వారా
15) పఠాన్‌కోట్
16) జమ్ము
17) లేహ్
18) ముండ్ర
19) జామ్ నగర్
20) హిస్సార్
21) పోర్ బందర్
22) కేసోద్
23) కాండ్ల
24) భుజ్
మరోవైపు ఇరుదేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకున్న నేపథ్యంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. యుద్ధ వాతావరణం నెలకున్న కారణంగా.. విమానం బయలుదేరు సమయానికి కంటే 3 గంటల ముందే ఎయిర్ పోర్ట్ చేరుకోవాలని ప్రయాణికులకు సూచించింది. తద్వారా విమానం ప్రయాణానికి 75 నిమిషాల కంటే ముందే చెక్ మూసివేస్తారని స్పష్టం చేసింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
భారత భూభాగంలోకి పాకిస్తాన్ తాజాగా క్షిపణి, డ్రోన్ దాడులను ప్రారంభించిన తర్వాత, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో గురువారం దేశవ్యాప్తంగా ఇరవై నాలుగు విమానాశ్రయాలు మూసివేయాలని భారత్ నిర్ణయించిన సంగతి తెలిసిందే.
ఇంకోవైపు.. ఎయిర్ పోర్టులలో ప్రవేశంపై నిషేధమంటూ వస్తున్న వార్తాలపై ప్రభుత్వం స్పందించింది. ఈ ప్రచారంలో కేంద్రం స్పందించింది. ఈ ప్రచారన్ని ఖండించింది. ఇందులో ఎంత మాత్రం వాస్తవం లేదని స్పష్టం చేసింది. అయితే పాకిస్థాన్ సరిహద్దు సమీపంలోని కేవలం 24 విమానాలను మాత్రమే మూసి వేసినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
Operation Sindoor: జమ్ము టార్గెట్‌గా పాకిస్థాన్ డ్రోన్ దాడులు
For National News And Telugu News