ChatGPT Surveillance: పోలీసు నిఘాలోకి చాట్‌జీపీటీ
ABN , Publish Date - Sep 03 , 2025 | 03:20 AM
చాట్‌జీపీటీతో సంభాషిస్తున్నారా? జాగ్రత్త! ఒకటికి రెండుసార్లు ఆలోచించి మీ మనసులో మాటలు టైప్ చేయండి..
న్యూఢిల్లీ, సెప్టెంబరు 2: చాట్‌జీపీటీతో సంభాషిస్తున్నారా? జాగ్రత్త! ఒకటికి రెండుసార్లు ఆలోచించి మీ మనసులో మాటలు టైప్ చేయండి! చాట్‌జీపీటీతో మీ సంభాషణలు అత్యంత రహస్యం, సురక్షితం అనుకోవడానికి ఇక ఎంతమాత్రం వీల్లేదు. చాట్‌జీపీటీతో మీ సంభాషణలు కొన్నిసార్లు పోలీసుల దృష్టికి కూడా వెళ్లొచ్చునని, యూజర్లు జరిపే సంభాషణలపై ప్రత్యేక నిఘా ఉంటుందని ఓపెన్ ఏఐ సంస్థ ప్రకటించింది. మరి.. ఎందుకీ నిఘా? అనంటే.. హింసాత్మకచర్యలపై, లేదా ఎవరినైనా లక్ష్యంగా చేసుకొని కలిగించాలనుకునే కష్టనష్టాలపై సంకేతాలను ముందుగానే పసిగట్టేందుకేనని ఓపెన్ ఏఐ పేర్కొంది. ప్రమాదకరమైన సంకేతాలున్న సంభాషణలను గుర్తించి వెంటనే ఓపెన్ ఏఐ సంస్థకు చెందిన స్పెషల్ రివ్యూ టీమ్‌కు, ఆపై సంభాషణల తీవ్రతను బట్టి సంస్థ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీకి పంపుతారు. ఇటీవల అమెరికాలో చాట్‌జీపీటీకి పూర్తిగా బానిసైన 56 ఏళ్ల స్టెయిన్ ఎరిక్ అనే వ్యక్తి, దాని మాటలను నమ్మి తల్లిని చంపేసిన సంగతి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
మణిపూర్‌లో పర్యటించనున్న ప్రధాని మోదీ..!
ఏపీ మహేష్ బ్యాంక్‌కు షాక్ ఇచ్చిన ఈడీ
For More National News And Telugu News