PMKSY: పీఎంకేఎస్‌వైకు మరో రూ.4600 కోట్లు
ABN , Publish Date - Aug 01 , 2025 | 03:08 AM
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రధాన మంత్రి కిసాన్ సంపద యోజన పీఎంకేఎ్‌సవై కు బడ్జెట్
దేశవ్యాప్తంగా 50 ఆహార వికిరణ కేంద్రాలు, 100 ఆహార తనిఖీ ల్యాబ్‌ల ఏర్పాటుకు వినియోగం
జాతీయ సహకార అభివృద్ధి సంస్థకు రూ.2 వేల కోట్లు
కేంద్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు
న్యూఢిల్లీ, జూలై 31: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రధాన మంత్రి కిసాన్ సంపద యోజన (పీఎంకేఎ్‌సవై)కు బడ్జెట్ కేటాయింపులు పెంచింది. ఆహారశుద్ధి రంగం కోసం ప్రవేశపెట్టిన ఈ పథకానికి రూ.1920 కోట్లు కేటాయించగా.. ప్రస్తుతం దాన్ని రూ.6520 కోట్లకు పెంచింది. పెంచిన రూ.4600 కోట్లను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే మంజూరు చేయాలని గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. పీఎంకేఎ్‌సవైకు పెంచిన నిధులను 50 బహుళ ఉత్పత్తుల ఆహార వికిరణ కేంద్రా లు, 100 ఆహార పదార్థాలను పరీక్షించే ల్యాబ్‌ల ఏర్పాటు కు వినియోగించనున్నట్లు క్యాబినెట్ సమావేశం అనంత రం కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ విలేకరులకు తెలిపారు. 50 ఆహార వికిరణ కేంద్రాల ఏర్పా టు ద్వారా దేశంలో ఏటా వివిధ రకాల ఆహార ఉత్పత్తుల నిల్వ/సంరక్షణ సామర్థ్యం 20-30 లక్షల టన్నుల మే రకు పెరగనుందన్నారు. దేశవ్యాప్తంగా ప్రైవేటు రంగంలో ఎన్‌ఏబీఎల్ గుర్తింపుతో 100 ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేసే ల్యాబ్‌లను ఏర్పాటు చేయడం ద్వారా అత్యాధునిక పరికరాలతో ఆహార నమూనాలను పరీక్షించవచ్చని తెలిపారు. జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్‌సీడీసీ)కు రూ.2 వేల కోట్ల ఆర్థిక సాయం చేసేందుకు కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ పర్యటన.. ప్రశాంతి రెడ్డి రియాక్షన్
జగన్ జైలుకు వెళ్తారా అంటే.. లోకేష్ ఏమన్నారంటే..
For More Telangana News And Telugu News