Share News

PM Narendra Modi: ప్రధాని మోదీ ఈ రాత్రి గం. 8 ఏం చెప్పబోతున్నారు

ABN , Publish Date - May 12 , 2025 | 04:43 PM

భారత్ - పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతల నడుమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రాత్రి 8 గంటలకు జాతినుద్దేశించి ఏం చెప్పబోతున్నారన్నది అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.

PM Narendra Modi: ప్రధాని మోదీ ఈ రాత్రి గం. 8 ఏం చెప్పబోతున్నారు
PM Narendra Modi to address nation

PM Narendra Modi to address nation: భారత్ - పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతల నడుమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రాత్రి 8 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన తర్వాత ఇరుదేశాలు ఒక అవగాహనకు వచ్చాయి. ఫలితంగా కాల్పులు, సైనిక చర్యలను నిలిపివేశాయి. ఆపరేషన్ సిందూర్ ప్రారంభించిన తర్వాత ప్రధాని దేశ ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడ్డం ఇదే తొలిసారి.

ప్రధాని ప్రసంగానికి సంబంధించి ఎటువంటి అధికారిక వివరాలు వెల్లడించనప్పటికీ, 26 మంది పౌరుల ప్రాణాలను బలిగొన్న పహల్గాం దాడి తరువాత పాకిస్తాన్‌పై ప్రతీకారంగా ప్రారంభించిన సైనిక చర్య గురించి ప్రధాని దేశ ప్రజలకు వివరిస్తారని భావిస్తున్నారు. దీంతో పాటు, ఆపరేషన్ సిందూర్ కి సంబంధించిన సమాచారం కూడా దేశ ప్రజలతో ప్రధాని పంచుకునే అవకాశం ఉంది. అటు, కశ్మీర్ అంశం గురించి కూడా దేశ ప్రధాని ప్రజలకు వివరించే ఛాన్స్ ఉంది. ప్రధాని ప్రసంగం గురించి అటు ప్రతిపక్షపార్టీలైన కాంగ్రెస్ మిత్రపక్షాలు కూడా ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నాయి.


ఇవి కూడా చదవండి..

Operation Sindoor: పాక్ దాడులను సమర్థంగా తిప్పికొట్టాం: ఎయిర్ మార్షల్ ఎ.కె. భార్తీ

India-Pakistan Ceasefire: భారత్, పాక్ చర్చలు సాయంత్రానికి వాయిదా

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ ముగియలేదు.. పాకిస్తాన్‌కు వార్నింగ్..

For National News And Telugu News

Updated Date - May 13 , 2025 | 11:26 PM