Narendra Modi: ఎన్టీఆర్ కృషి నేటి తరతరాలకు స్ఫూర్తినిస్తుంది..మార్గదర్శకంగా నిలుస్తుంది
ABN , Publish Date - May 28 , 2025 | 11:34 AM
తెలుగు సినిమాల్లో హీరోగా, ప్రజల హృదయాల్లో నేతగా నిలిచిన దివంగత నందమూరి తారకరామారావు 102వ జయంతిని (NTR 102nd Birth Anniversary) నేడు (మే 28న) దేశం ఘనంగా స్మరించుకుంటోంది. ఈ సందర్భంగా, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఎన్టీఆర్‌కు హృదయపూర్వకంగా నివాళులర్పించారు.
దివంగత నందమూరి తారక రామారావు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానుభావుడు. నేడు (మే 28న) ఆయన 102వ జయంతి (NTR 102nd Birth Anniversary) సందర్భంగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (narendra modi) ఆయనకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా సినిమా, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ చేసిన కృషి తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉందని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ప్రస్తావించారు. ఆయన చేసిన అద్భుతమైన పాత్రలు, ప్రజా సేవలో ఆయన చూపిన దార్శనికత, నేటి తరాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని మోదీ అన్నారు. ఆయన నాయకత్వం, సినిమా రంగంలో ఆయన చేసిన పాత్రలు, ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచాయని గుర్తు చేశారు. సమాజం పట్ల ఆయన దార్శనికతను నెరవేర్చడానికి మేము కృషి చేస్తూనే ఉంటామన్నారు.