Share News

PM Modi: ఇది మధ్యతరగతి బడ్జెట్‌: మోదీ

ABN , Publish Date - Feb 03 , 2025 | 05:07 AM

ప్రతి కుటుంబం హ్యాపీగా ఉందన్నారు. ఆదివారం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మోదీ మాట్లాడారు. రూ.12 లక్షల వరకు ఆర్జించే ప్రజలకు తాజా బడ్జెట్‌ గణనీయమైన ఉపశమనం కలిగించిందని, స్వాతంత్య్ర భారత చరిత్రలో ఇప్పటి వరకూ ఇంతటి ప్రయోజనం కలగలేదని చెప్పారు.

PM Modi: ఇది మధ్యతరగతి బడ్జెట్‌: మోదీ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: భారతదేశ చరిత్రలోనే మధ్యతరగతికి అత్యంత అనుకూల బడ్జెట్‌ ఇది అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. ప్రతి కుటుంబం హ్యాపీగా ఉందన్నారు. ఆదివారం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మోదీ మాట్లాడారు. రూ.12 లక్షల వరకు ఆర్జించే ప్రజలకు తాజా బడ్జెట్‌ గణనీయమైన ఉపశమనం కలిగించిందని, స్వాతంత్య్ర భారత చరిత్రలో ఇప్పటి వరకూ ఇంతటి ప్రయోజనం కలగలేదని చెప్పారు. ఢిల్లీలోని ఆమ్‌ఆద్మీ ప్రభుత్వం తప్పుడు హామీ లు ఇస్తోందని, అవినీతిలో కూరుకుపోయిందని, దాని ఫలితంగానే దేశరాజధానిలో ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయని మోదీ విమర్శించారు. అద్దాల మేడ ల్లో నివసించేవారికి పేదల పూరిగుడిసెలు, మధ్యతరగతి ప్రజల డబు ల్‌ బెడ్‌రూమ్‌ ఫ్లాట్లు పట్టవంటూ ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌పై విమర్శ లు గుప్పించారు. ప్రజలను లూటీ చేస్తున్నవారిని జవాబుదారీగా చేస్తామన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

వేల ఏళ్ల భారత్‌-ఇండోనేసియా బంధం

భారత్‌, ఇండోనేసియా దేశాల మధ్య సంబంధాలు భౌగోళిక రాజకీయ అంశాలకు మాత్రమే పరిమితం కాదని, వేల సంవత్సరాలుగా ఒకే విధమైన సంస్కృతి, చరిత్రను కలిగి ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. రెండు దేశాలూ భిన్నత్వంలో ఏకత్వం కలిగి ఉన్నాయన్నారు. ఇండోనేసియా రాజధాని జకార్తాలోని మురుగన్‌ ఆలయ మహాకుంభాభిషేకానికి విచ్చేసిన భక్తులను ఉద్దేశించి ఆదివారం మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగించార


ఇవి కూడా చదవండి..

Sonia Gandhi: సోనియా గాంధీపై కోర్టులో ఫిర్యాదు చేసిన న్యాయవాది.. ఎందుకంటే..

Maha Kumbh Mela 2025: మహా కుంభమేళాకు భక్తజనం.. ఫిబ్రవరి 1 నాటికి ఎంత మంది వచ్చారంటే..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 03 , 2025 | 05:07 AM