Share News

PM Modi: ట్రంప్ ఆహ్వానం తిరస్కరించా

ABN , Publish Date - Jun 20 , 2025 | 07:02 PM

ఒడిసాలో తొలి బిజీపీ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకోవడాన్ని, సుపరిపాలన అదించడాన్ని ప్రధాని ఈ సందర్భంగా ప్రశంసించారు. జూన్ 20వ తేదీ ప్రత్యేకమైన రోజని, ఈరోజుతో బీజేపీ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుందని చెప్పారు.

PM Modi: ట్రంప్ ఆహ్వానం తిరస్కరించా
Narendra Modi

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trumph) ఆహ్వానాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) సున్నితంగా తిరస్కరించారు. ట్రంప్ ఆహ్వానం కంటే జగన్నాథుని జన్మస్థలమైన పూరీని దర్శించడానికే ఆయన తొలి ప్రాధాన్యం ఇచ్చారు. ఈ విషయాన్ని ప్రధాన మంత్రి స్వయంగా శుక్రవారంనాడు భువనేశ్వర్‌లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో వెల్లడించారు. రూ.18,600 కోట్లు విలువైన 105 అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు. ఒడిశా విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించారు. కొత్త రైళ్లను ప్రారంభించారు.


ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, జగన్నాథుని జన్మస్థలానికి రావడం కోసం అమెరికాలో పర్యటించాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించినట్టు చెప్పారు.


ఒడిసాలో తొలి బిజీపీ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకోవడాన్ని, సుపరిపాలన అదించడాన్ని ప్రధాని ఈ సందర్భంగా ప్రశంసించారు. జూన్ 20వ తేదీ ప్రత్యేకమైన రోజని, ఈరోజుతో బీజేపీ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుందని చెప్పారు. ప్రజాసేవ, ప్రజానమ్మకాన్ని ఏడాదిలో బీజేపీ ప్రభుత్వం పాదుకొలిపిందని అన్నారు. ఒడిశా ప్రజలు, ముఖ్యమంత్రి మోహన్ మాఝీ, ఆయన టీమ్ మొత్తానికి అభినందలు తెలియజేస్తున్నానని అన్నారు. 2024 జూన్‌లో ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఆ రాష్ట్రంలో మోదీ పర్యటించడం ఇది ఆరోసారి.


ఇవి కూడా చదవండి..

ఇంగ్లీషు భాషపై అమిత్‌షా వ్యాఖ్యలకు రాహుల్‌గాంధీ కౌంటర్

వేదికపై కంటతడి పెట్టిన ద్రౌపది ముర్ము

For National News And Telugu News

Updated Date - Jun 20 , 2025 | 07:28 PM