Share News

India space sector: మన దేశ అంతరిక్ష రంగంలో సరికొత్త విప్లవం

ABN , Publish Date - Jun 25 , 2025 | 10:13 PM

భారత అంతరిక్ష రంగంలో సరికొత్త విప్లవం రాబోతోంది. ప్రపంచ అగ్రదేశాలతో భారత అంతరిక్ష సంస్థలు పోటీపడి ముందుకు సాగిపోయే కల అతి త్వరలోనే సాకారం కాబోతోంది. భారత అంతరిక్ష రంగంలోకి ఇప్పుడు ప్రైవేట్ సంస్థలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

India space sector: మన దేశ అంతరిక్ష రంగంలో సరికొత్త విప్లవం
India space sector

ఢిల్లీ, జూన్ 25: భారత అంతరిక్ష రంగంలో సరికొత్త విప్లవం రాబోతోంది. ప్రపంచ అగ్రదేశాలతో భారత అంతరిక్ష సంస్థలు పోటీపడి ముందుకు సాగిపోయే కల అతి త్వరలోనే సాకారం కాబోతోంది. దీనికి కారణం ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం. అదేంటంటే.. భారత అంతరిక్ష రంగ ప్రవేశానికి ఇప్పుడు ప్రైవేట్ సంస్థలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇది అద్భుతమైన ఫలితాలకు నాందిగా, ఒక కీలక మలుపుగా కేంద్ర అటామిక్ ఎనర్జీ, అంతరిక్ష శాఖ మంత్రి జితేంద్ర సింగ్ చెబుతున్నారు.

ప్రధాని మోదీ సంచలన నిర్ణయంతో ఈ దశాబ్దంలో భారత అంతరిక్ష రంగం 40-45 బిలియన్ US డాలర్లకు వృద్ధి చెందుతుందని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. అంతేకాదు, ఆక్సియం-4 మిషన్ సమయంలో వ్యోమగామి, గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా నిర్వహించే ప్రయోగాలు, చంద్రయాన్-4, ఇంకా 2035లో ప్లాన్ చేస్తున్న భారత్ స్పేస్ స్టేషన్ వంటి భవిష్యత్ అంతరిక్ష కార్యకలాపాలకు సిద్ధం కావడానికి ఇదెంతో సహాయపడుతుందని ఆయన అన్నారు.

2.jpg


అంతరిక్ష ప్రయోగాల్లో పాల్గొనటానికి ప్రైవేట్ రంగాన్ని అనుమతించినప్పుడే.. ఇండియా స్పేస్ ప్రోగ్రామ్‌కు అతిపెద్ద మైలురాళ్లలో ఒకటి దరిచేరిందని సింగ్ అన్నారు. భారతదేశ అంతరిక్ష ప్రయాణంలో ఇది ఒక ములుపు అని చెప్పిన కేంద్ర మంత్రి.. ఆ దిశగా ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం అద్భుతమన్నారు. గత నాలుగైదేళ్ల కాలంలో అంతరిక్ష రంగంలోకి ప్రైవేట్ రంగం నుండి వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి' అని సింగ్ తెలిపారు.

Chandrayan-4.jpgరాబోయే కాలంలో భారతదేశ అంతరిక్ష రంగం వేగవంతమైన వృద్ధికి సిద్ధంగా ఉందని కేంద్రమంత్రి అన్నారు. వచ్చే ఎనిమిది, పదేళ్లలో మనం నాలుగు నుంచి ఐదురెట్లు ఎక్కువ అంటే, దాదాపు 40-45 బిలియన్ US డాలర్ల వృద్ధికి వెళ్లవచ్చని జితేంద్ర సింగ్ చెప్పారు. 'భవిష్యత్ మిషన్లకు కూడా ఇది మంచి ఊతమిస్తుందని చెప్పిన కేంద్రమంత్రి.. ఇది చంద్రయాన్ 4 తో పాటు, 2035 నాటికి మనం ప్లాన్ చేస్తున్న భారత్ స్పేస్ స్టేషన్ వంటి మిషన్లకు, అంతరిక్షంలో లేదా మైక్రోగ్రావిటీ పరిస్థితుల్లో ఎక్కువ కాలం ఉండటానికి - శుభాన్షు నిర్వహించే ప్రయోగాల ద్వారా ఎలాంటి ఏర్పాట్లు చేయాలో కూడా మనకు అవగతమౌతుందని సింగ్ అన్నారు.

India-Space-Station.jpg


ఇవి కూడా చదవండి..

కమాండర్ అభినందన్‌ను బంధించిన పాకిస్థాన్ మేజర్ హతం

ఇరాన్ అణు స్థావరాలపై అమెరికా దాడులు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

మరిన్ని ఏపీ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 25 , 2025 | 10:23 PM