Piyush Goyal: వాణిజ్య చర్చల కోసం అమెరికాకు గోయల్
ABN , Publish Date - Sep 21 , 2025 | 06:16 AM
అమెరికాతో ఈ నెల 22న వాణిజ్య చర్చల నిమిత్తం కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం ఆ దేశానికి వెళ్లనుంది....
న్యూఢిల్లీ, సెప్టెంబరు 20: అమెరికాతో ఈ నెల 22న వాణిజ్య చర్చల నిమిత్తం కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం ఆ దేశానికి వెళ్లనుంది. పరస్పరం ప్రయోజనకరమైన వాణిజ్య ఒప్పందాన్ని వీలైనంత త్వరగా ముగించే లక్ష్యంతో చర్చలను ముందుకు తీసుకెళ్లాలని ప్రతినిధి బృందం యోచిస్తోందని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ శనివారం పేర్కొంది. చర్చల నిమిత్తం న్యూయార్క్ వెళ్లనున్న కేంద్ర మంత్రితో ప్రత్యేక కార్యదర్శి రాజేష్ అగర్వాల్, ఇతర అధికారులు ఉంటారు. ఈనెల 16న అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం నుంచి అధికారుల బృందం భారత్‌ను సందర్శించిన సందర్భంగా వివిధ అంశాలపై సానుకూల చర్చలు జరిగాయి. ఈ చర్చల కొనసాగింపుగా కేంద్ర వాణిజ్య మంత్రి నేతృత్వంలోని ప్రతినిధుల బృందం అమెరికాకు వెళ్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి
ఓటు చోరీ.. రాహుల్ గాంధీ తుస్సు బాంబులేశాడు.. రామచందర్ రావు సెటైర్లు
మహిళలను బీఆర్‌ఎస్ ఇన్సల్ట్ చేస్తోంది.. మంత్రి సీతక్క ఫైర్
Read Latest Telangana News And Telugu News