Air India Crash: రాయిటర్స్, వాల్‌స్ట్రీట్ జర్నల్‌కు పైలట్ల సంఘం లీగల్ నోటీసు
ABN , Publish Date - Jul 19 , 2025 | 06:09 PM
ప్రమాదంపై దర్యాప్తు పూర్తి కాకముందే పైలట్ల తప్పదమే కారణమంటూ నిరాధార కథనాలు ప్రచురించడాన్ని ఎఫ్ఐపీ తప్పుపట్టింది. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై తప్పుడు కథనాలు ప్రచురించినందుకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా (AI-171) విమాన ప్రమాదంపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) ఇచ్చిన నివేదికను ప్రస్తావిస్తూ 'ది వాల్ స్ట్రీట్ జర్నల్', 'రాయిటర్స్' సంస్థ ప్రచురించిన కథనాలపై భారత పైలట్ల సమాఖ్య (ఎఫ్ఐపీ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రమాదంపై దర్యాప్తు పూర్తి కాకముందే పైలట్ల తప్పదమే కారణమంటూ నిరాధార కథనాలు ప్రచురించడాన్ని తప్పుపట్టింది. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై తప్పుడు కథనాలు ప్రచురించినందుకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ రెండు వార్తా సంస్థలకు లీగల్ నోటీసులు జారీ చేసింది.
'ఏఏఐబీ నివేదికను సరిగా చదవకుండానే పైలెట్ల పొరపాటు వల్లే ఇంధనం కంట్రోల్ స్విచ్‌లు నిలిపివేయబడినట్టు కథనాలు ప్రచురితమవుతున్నాయి. ఇలాంటి కథనాలు రాసినందుకు తగిన చర్యలు తీసుకుంటాం' అని ఎఫ్ఐపీ అధ్యక్షుడు కెప్టెన్ సీఎస్ రాంధ్వా తెలిపారు.
ఏఏఐబీ ఏమి చెప్పింది
అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ఏఓఐబీ కేంద్రానికి ఇటీవల ప్రాథమిక నివేదక సమర్పించింది. ప్రమాదానికి గురైన విమానం టేకాఫ్ అయిన 3 సెకన్లలో ఫ్యూయెల్ కంట్రోలర్ స్విచ్‌లు సెక్షన్ల వ్యవధిలో రన్ మోడ్ నుంచి కటాఫ్ మోడ్‌కు మారాయి. దీంతో ఫ్లైట్‌కు ఇంధన సరఫరా నిలిచిపోయింది. ఫ్లైట్ గాల్లోనే థ్రస్ట్ కోల్పోయి రెండు ఇంజన్లు ఆగిపోయాయి. ఒక పైలట్ ఫ్యూయెల్ కంట్రోల్ స్విచ్‌లు ఎందుకు కటాఫ్ చేశావని ప్రశ్నించగా, మరొక పైలట్ తాను ఆఫ్ చేయలేదని బదులిచ్చాడని కాక్‌పిట్ వాయిస్ రికార్డులో నమోదైనట్టు తెలిపింది. ఈ క్రమంలో పైలట్ల తప్పిదం వల్లే విమాన ప్రమాదం జరిగిందంటూ ఒక నిర్దారణకు వస్తూ కథనాలు వెలువడ్డాయి. అయితే దీనిపై కేంద్రం వివరణ ఇస్తూ ప్రాథమిక నివేదికే తుది నివేదిక కాదని, అప్పుడే తుది అవగాహనకు రావద్దని ప్రజలను కోరింది. ప్రపంచంలోనే నిపుణులైన పైలట్లు మనకు ఉన్నారని, వారి సేవలు ప్రశంసనీయమని కొనియాడింది.
ఇవి కూడా చదవండి..
BCCI: సిగ్గుసిగ్గు.. బీసీసీఐపై విరుచుకుపడిన ప్రియాంక చతుర్వేది
అధికార పార్టీ ఎమ్మెల్యే రాజీనామా.. రాజకీయాలకూ గుడ్‌బై
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి