Bhojpuri Actor Threatened: భోజ్‌పురి నటుడికి బిష్ణోయ్ గ్యాంగ్ వార్నింగ్.. సల్మాన్ ఖాన్‌ను కలిస్తే..
ABN , Publish Date - Dec 08 , 2025 | 08:04 PM
సల్మాన్ ఖాన్‌తో కలిసి బిగ్‌బాస్‌షోలో పాల్గొంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడు ఒకరు తనను బెదిరించారంటూ ప్రముఖ భోజ్‌పురి నటుడు పవన్ సింగ్ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన సిబ్బందికి కూడా బెదిరింపులు వచ్చాయని అన్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడు తనను బెదిరిస్తున్నాడంటూ భోజ్‌పురి నటుడు పవన్ సింగ్ తాజాగా ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు (Bishnoi Gang Threats). క్రైమ్ బ్రాంచ్ పోలీసు విభాగంలో రెండు వేర్వేరు ఫిర్యాదులను దాఖలు చేశారు. తన సిబ్బందికి కూడా బెదిరింపు కాల్స్ వచ్చాయని అన్నాడు. ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్‌తో కలిసి బిగ్‌బాస్‌లో పాల్గొంటానంటూ పవన్ సింగ్ ఇన్‌స్టాలో ప్రకటించాక బెదిరింపులు వచ్చాయని తన ఫిర్యాదులో పవన్ సింగ్ పేర్కొన్నారు (Bhojpuri Actor Files Police Complaint).
తాను బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడినంటూ ఓ వ్యక్తి గుర్తుతెలియని ఫోన్ నెంబర్ల నుంచి ఫోన్ చేశారని ఆయన ఫిర్యాదు చేశారు. బిహార్, ముంబైల నుంచి ఈ కాల్స్ వచ్చినట్టు చెప్పారు. తన సిబ్బందిలో కొందరికి కూడా బెదిరింపులు వచ్చాయని అన్నారు. బిగ్‌బాస్‌లో సల్మాన్ ఖాన్‌తో కలిసి పాల్గొంటే తీవ్రపరిణామాలు ఉంటాయని హెచ్చరించినట్టు తెలిపారు. తమ నుంచి డబ్బులు కూడా డిమాండ్ చేశారని అన్నారు. వరుసపెట్టి టెక్స్ట్ మెసేజీలు కూడా పంపించి బెదిరింపులకు దిగారని అన్నారు. తమ హెచ్చరికలను ఖాతరు చేయకుండా సల్మాన్ ఖాన్‌ను కలిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించినట్టు తెలిపారు. త్వరలో తన సిబ్బందితో కలిసి ఆయన మరోసారి క్రైమ్ బ్రాంచ్ పోలీసులను కలవనున్నారు.
కాగా, అక్టోబర్‌లో మరో కాంట్రవర్సీ కారణంగా పవన్ వార్తల్లోకి ఎక్కారు. ఆయన రెండో భార్య జ్యోతి కన్నీరుమున్నీరవుతూ నెట్టింట వీడియో షేర్ చేయడం కలకలానికి దారి తీసింది. లఖ్నవూలోని తమ నివాసంలోకి తనను రానీయకుండా పవన్ అడ్డుపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భర్త ఫిర్యాదు కారణంగా పోలీసులు తనపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారని, నివాసంలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారని తెలిపారు. పోలీసుల ముందే తాను విషం మింగి ఆత్మహత్య చేసుకుంటానని కూడా చెప్పారు. కాగా, జ్యోతి ఆరోపణలను పవన్ తోసి పుచ్చారు. తాను ఆమెను అడ్డుకోకపోగా సగౌరవంగా ఇంట్లోకి ఆహ్వానించానని కూడా చెప్పారు. తామిద్దరం కాసేపు మాట్లాడుకున్నామని కూడా చెప్పారు.
ఇవి కూడా చదవండి:
ప్రయాణికులకు ఇండిగో రూ.610 కోట్లు రీఫండ్.. పౌర విమానయాన శాఖ వెల్లడి
రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ప్రధాని మోదీ ఇచ్చిన గిఫ్ట్స్ ఇవే
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి