Share News

Premalatha: కాంగ్రెస్‌ సభలో పాల్గొనడం తప్పుకాదు..

ABN , Publish Date - Jun 30 , 2025 | 01:15 PM

కాంగ్రెస్‌ నిర్వహించిన సభలో డీఎండీకే తరుఫున సుధీశ్‌ పాల్గొనడం తప్పుకాదని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయ్‌కాంత్‌(Premalatha Vijaykanth) పేర్కొన్నారు.

Premalatha: కాంగ్రెస్‌ సభలో పాల్గొనడం తప్పుకాదు..

- డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయ్‌కాంత్‌

చెన్నై: కాంగ్రెస్‌ నిర్వహించిన సభలో డీఎండీకే తరుఫున సుధీశ్‌ పాల్గొనడం తప్పుకాదని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయ్‌కాంత్‌(Premalatha Vijaykanth) పేర్కొన్నారు. కోవైలో ఆమె ఆదివారం మీడియాతో మాట్లాడుతూ... కృష్ణగిరిలో నష్టపోయిన మామిడి రైతులకు మద్దతుగా సోమవారం తన అధ్యక్షతన ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు.


రాష్ట్రప్రభుత్వం ప్రజలకు ప్రాథమిక విద్య నుంచి డిగ్రీ వరకు నాణ్యమైన విద్యను ఉచితంగా అందజేయాలని అప్పుడే రాష్ట్రం ప్రకాశవంతంగా ఉంటుందన్నారు. యేళ్ళ తరబడి కొనసాగుతున్న స్నేహం వల్లే తమ పార్టీ తరుఫున సుధీశ్‌ కాంగ్రెస్‌ కార్యక్రమంలో పాల్గొన్నారని, దీనికి రాజకీయాలతో ముడిపెట్టరాదన్నారు. 2026 జనవరి 9న కడలూరులో నిర్వహించనున్న డీఎండీకే రాష్ట్రస్థాయి కార్యక్రమంలో అసెంబ్లీ ఎన్నికల పొత్తులపై నిర్ణయం ప్రకటిస్తామన్నారు.


nani2.2.jpg

రాష్ట్రంలో ఏన్డీయే కూటమికి ప్రాంతీయ పార్టీ నాయకత్వం వహించాలన్నారు. ముఖ్యమంత్రి స్టాలిన్‌ గత అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే తరుఫున ప్రజలకిచ్చిన హామీల్లో ఒకటి కూడా పూర్తిగా నెరవేర్చలేదని, మత్తులో తూలుతున్న రాష్ట్రానికి మంచి జరగాలంటే ప్రభుత్వం మారాల్సిందేనని ప్రేమలత అభిప్రాయం వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి.

గుడ్ న్యూస్.. రూ.98 వేల దిగువకు బంగారం.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

ఎంపీ రఘునందన్‌కు మళ్లీ బెదిరింపు కాల్‌

Read Latest Telangana News and National News

Updated Date - Jun 30 , 2025 | 01:15 PM