Share News

Speaker Appau: పార్లమెంటు ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేయడంలేదు...

ABN , Publish Date - Aug 27 , 2025 | 09:57 AM

పార్లమెం టు ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేయడం లేదని,జస్టిస్‌ సుదర్శన రెడ్డి విజయం సాధిస్తే మాత్రమే పార్లమెంటు ప్రజాస్వామ్య బద్ధంగా పనిచేస్తుందని స్పీకర్‌ అప్పావు అభిప్రాయం వ్యక్తం చేశారు. తిరునల్వేలిలో మంగళవారం స్పీకర్‌ మీడియాతో మాట్లాడారు.

Speaker Appau: పార్లమెంటు ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేయడంలేదు...

- స్పీకర్‌ అప్పావు

చెన్నై: పార్లమెం టు ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేయడం లేదని,జస్టిస్‌ సుదర్శన రెడ్డి విజయం సాధిస్తే మాత్రమే పార్లమెంటు ప్రజాస్వామ్య బద్ధంగా పనిచేస్తుందని స్పీకర్‌ అప్పావు(Speaker Appau) అభిప్రాయం వ్యక్తం చేశారు. తిరునల్వేలిలో మంగళవారం స్పీకర్‌ మీడియాతో మాట్లాడుతూ... సమగ్ర శిక్షా అభియాన్‌ పథకంలో రాష్ట్రానికి రావాల్సిన రూ.2వేల కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయలేదన్నారు. ఉప రాష్ట్రపతి పదవికి ఇండియా కూటమి తరఫున పోటీచేస్తున్న జస్టిస్‌ సుదర్శన రెడ్డి చారిత్రాత్మక తీర్పులు ఇచ్చి, న్యాయమూర్తిగా పేరుగడించారన్నారు.


nani1.2.jpg

బీజేపీ ఉప రాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌ ఆర్‌ఎ్‌సఎస్‌ సిద్ధాంతకర్త కావడంతో, తాము ఆయనకు మద్దతివ్వలేదన్నారు. అమెరికా పన్ను విధింపుతో తమిళనాడు సహా పలు రాష్ట్రాలు వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, ఇందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విదేశాంగ విధానాల వైఫల్యాలే కారణమని స్పీకర్‌ ఆరోపించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అందుకే యూరియా ఆలస్యమైంది

మంత్రి ఉత్తమ్‌‌కు హరీష్ రావు సంచలన లేఖ

Read Latest Telangana News and National News

Updated Date - Aug 27 , 2025 | 09:57 AM