Pak Missiles: పాక్ వద్ద ఉన్న మిసైల్స్ ఇవే.. వీటి సామర్థ్యం ఎంతంటే..
ABN , Publish Date - May 10 , 2025 | 05:32 PM
భారత ఉపఖండంలో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పాక్ మిసైళ్ల శక్తిసామర్థ్యాలు ఏవో ఈ కథనంలో కూలంకషంగా తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: తినడానికి తిండి గింజలు లేని పాకిస్థాన్ యుద్ధోన్మాదంతో రెచ్చిపోతోంది. భారత్‌ను అదే పనిగా కవ్విస్తోంది. ఈ చర్యలకు దాయాది దేశం తగిన ఫలితం మూటగట్టుకోక తప్పదు. ఇప్పటికే భారత్ పాక్ దేశ స్థావరాలపై భారీ దాడులు చేసి పలు టెర్రరిస్టులను అంతమొందించింది. పాక్ ప్రయోగించిన మిసైళ్లు, డ్రోన్స్‌ను కూడా గాల్లోనే పేల్చిపారేసింది. ఈ నేపథ్యంలో అసలు పాక్ వద్ద ఉన్న ముఖ్య మిసైళ్లు ఏవో చూద్దాం.
పాక్ ఇటీవలే 450 కిలోమీటర్ల రేంజ్ బాలిస్టిక్ మిసైల్ అబ్దాలీని ఇటీవలే పరీక్షించింది. దీనితో పాటు అనేక ఇతర మిసైళ్లు పాక్ వద్ద ఉన్నాయి. దాయాది వద్ద ఉన్న హఫ్త్-1 షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్.. 70-100 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. సంప్రదాయ వార్ హెడ్స్‌ను మోసుకెళ్లగలదు.
హఫ్త్-2 (అబ్దాలీ) 180 నుంచి 200 కిలోమీటర్ల రేంజ్‌ను టార్గెట్ చేయగలదు. ఇది రకరకాల వార్ హెడ్స్‌ను మోసుకెళ్లగలదు. హఫ్త్-3 (ఘజ్నవీ) మిసైల్ రేంజ్ 300 కిలోమీటర్లు. దీనికి అణువార్ హెడ్‌లను మోసుకెళ్లే సామర్థ్యం కూడా ఉంది. ఇక హఫ్త్-4 (షాహీన్-1) షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్.. 750 నుంచి 900 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. అణు, రసాయనిక వార్‌హెడ్‌లను మోసుకెళ్లే సామర్థ్యం దీని సొంతం. ఇక మధ్య శ్రేణి ఘౌరీ మిసైల్ 1250 నుంచి 1500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. అణు వార్ హెడ్స్ ప్రయోగించేందుకు వీటిని పాక్ ఉపయోగించొచ్చు.
షాహీన్ -2 కూడా మధ్యశ్రేణి బాలిస్టిక్ మిసైల్. దీని రేంజ్ గరిష్ఠంగా 2 వేల కిలోమీటర్లు. అణు, రసాయన వార్ హెడ్స్ మోసుకెళ్లగలదు. సబ్ సానిక్ క్రూయిజ్ మిసైల్ బాబర్.. 350 నుంచి 700 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. హఫ్త్ నసర్ అనే స్వల్ప శ్రేణి మిసైల్‌కు అణుసామర్థ్యం ఉంది. దీని రేంజ్ 70 కిలోమీటర్లు. షాహీన్ -3 మధ్య శ్రేణి మిసైల్ ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉంది. దీని రేంజ్ 2750కిలోమీటర్లు. నేవీ షిప్‌లను ధ్వంసం చేసేందుకు ఉద్దేశించిన ఎక్సోసెట్ క్షిపణి సామర్థ్యం 40 నుంచి 180 కిలోమీటర్లు. అణుసామర్థ్యం కలిగిన మధ్య శ్రేణి క్షిపణి అబాదిల్ ప్రస్తుతం అభివద్ధి దశలోనే ఉంది.
ఇవి కూడా చదవండి
ఉద్రిక్తతలు తగ్గించేందుకు ఇండియానే మొదట చొరవ చూపాలి: మెహబూబా ముఫ్తీ
భారత్, పాకిస్తాన్ యుద్ధంపై జాన్వీ ఎమోషనల్ పోస్ట్..
భారత్, పాక్ యుద్ధం అప్‌డేట్స్ మీ ఫోన్లో చూడాలనుకుంటే ఇలా చేయండి..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి