Voter List: సర్ తర్వాతా పాక్ మహిళలకు బిహార్‌లో ఓటు
ABN , Publish Date - Aug 25 , 2025 | 03:02 AM
బిహార్ ఓటరు జాబితాపై ఏదో ఒక వివాదం వెలుగు చూస్తోంది. తాజాగా బిహార్‌లోని భగల్పూరులో ఇద్దరు పాక్ వృద్ధ మహిళలకు ..
భగల్పూర్, ఆగస్టు 24: బిహార్ ఓటరు జాబితాపై ఏదో ఒక వివాదం వెలుగు చూస్తోంది. తాజాగా బిహార్‌లోని భగల్పూరులో ఇద్దరు పాక్ వృద్ధ మహిళలకు ఓటరు కార్డు జారీచేయడం కేంద్ర ప్రభుత్వాన్నే నివ్వెరపరచింది. ఆ ఇద్దరి ఓటరు కార్డులను వెంటనే రద్దుచేయించి, సమగ్ర విచారణ జరపాలని భగల్పూరు కలెక్టరు, ఎస్పీలను కేంద్ర హోంశాఖ తాజాగా ఆదేశించింది. ఆ వివరాల్లోకి వెళితే.. ఇమ్రానా, ఫిరదౌసియా అనే ఇద్దరు పాక్ మహిళలు 1956లో విజిటర్ వీసాపై భారత్‌కు వచ్చి తిరిగి వెళ్లలేదు. ప్రస్తుతం వీరు భగల్పూరులోని ఇషాక్‌చక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భికన్‌పూర్ గుమ్టి నం. 3లోని ట్యాంక్ లేన్‌లో నివాసం ఉంటున్నారు. ఇమ్రానా 3నెలల కోసం, ఫిరదౌసియా మూడేళ్ల కోసం ఈ వీసా తీసుకున్నారు. అయితే, ఇటీవల నిర్వహించిన సమగ్ర ఓటరు సవరణ(ఎ్‌సఐఆర్) తర్వాత కూడా వీరి ఓట్లను ఈసీ తీసివేయలేకపోవడం గమనార్హం.
ఇవి కూడా చదవండి..
మరాఠా రిజర్వేషన్‌పై ఆఖరి పోరాటం.. మనోజ్ జారంగే పిలుపు
రాహుల్ ఓటర్ అధికార్ యాత్రలో జోష్.. హాజరుకానున్న ప్రియాంక
For More National News And Telugu News