Pakistan Shelling: జమ్మూకశ్మీర్‌లో పాక్ ఆర్టిలరీ దాడులు.. స్థానిక మహిళ మృతి
ABN , Publish Date - May 09 , 2025 | 05:51 PM
జమ్మూలో సామాన్యులే టార్గెట్‌గా పాక్ షెల్లింగ్‌కు పాల్పడుతోంది. తాజా దాడిలో ఓ స్థానిక మహిళ మృతి చెందారు.
ఇంటర్నెట్ డెస్క్: సామాన్య పౌరులే టార్గెట్‌గా పాకిస్థాన్ జమ్మూకశ్మీర్‌లోని ఊరీ సెక్టర్‌లో ఆర్టిలరీ దాడులకు తెగబడుతోంది. ఈ దాడుల్లో తాజాగా 45 ఏళ్ల మహిళ నర్గిస్ బానో మరణించగా ఆమె ఇద్దరు బంధువులు తీవ్ర గాయాపాలయ్యారు. పాక్ ఆర్టిలరీ షెల్ వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని తాకడంతో ఈ ఘోరం జరిగింది. పాక్ దాడుల నుంచి తప్పించుకునేందుకు ఆ కుటుంబం ఓ స్కార్పియో కారులో సురక్షిత ప్రాంతాలకు తరలివెళుతున్న సమయంలో ఈ దారుణం చోటుచేసుకుంది. తమ స్వగ్రామం రాజర్‌వానీకి మూడు కిలోమీటర్ల దూరంగా ఉండగా పాక్ భారీ ఎత్తున ఆర్టిలరీ షెల్లింగ్‌కు దిగిందని బాధితులు తెలిపారు.
పాక్ దాడులకు దీటుగా బదులిచ్చామని ఆర్మీ అధికారులు చెప్పారు. పాక్ తాజా ఆర్టిలరీ దాడిలో సామాన్య పౌరులు మరణించడం ఇదే తొలిసారి. గురువారం రాత్రి నుంచి పాకిస్థాన్ షెల్లింగ్‌కు దిగుతోందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. కాల్పులకు కాసేపు విరామం ఇచ్చినా శుక్రవారం ఉదయం కూడా ఆర్టిలరీ దాడులు కొనసాగాయని చెబుతున్నారు.
కమాల్‌కోట్, బొనియార్, గింజిల్, మొహురా వంటి సరిహద్దు ప్రాంతాల్లో పాక్ భారీ ఎత్తున పౌరుల నివాసాలే టార్గెట్‌గా ఆర్టిలరీ దాడులకు దిగింది. అనేక ఇళ్లకు నష్టం జరిగింది.
జమ్మూకశ్మీర్ రక్షణ మౌలిక వసతులు ఉన్న ప్రాంతాల గగనతలంలోకి డ్రోన్లు, మిసైల్స్ చొరబడినట్టు వార్తలు రావడంతో స్థానిక అధికారులు అక్కడ హైఎలర్ట్ ప్రకటించారు. పాక్ దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో విద్యాసంస్థలకు శని, ఆదివారాల్లో మూసివేయనున్నట్టు ప్రకటించారు.
Also Read:
పాక్‌తో ఉద్రిక్తతలు.. దేశ ప్రజలకు రోహిత్ శర్మ రిక్వెస్ట్
సోషల్ మీడియాలో పాక్ తప్పుడు ప్రచారం.. వాస్తవాలు బయటపెట్టిన PIB
ఇండో-పాక్ వార్‌పై చైనా షాకింగ్ రియాక్షన్.. ఏమందంటే..
పాకిస్తాన్ నిజస్వరూపం బట్టబయలు
For National News And Telugu News