Share News

Khawaja Asif: అవును ఉగ్రవాదాన్ని పెంచి పోషించాం

ABN , Publish Date - Apr 26 , 2025 | 04:33 AM

ఉగ్రవాదులకు శిక్షణ, నిధులు అందించామని పాక్‌ రక్షణ మంత్రి ఖవాజా అసిఫ్‌ అంగీకరించారు. పశ్చిమ దేశాల కోసం ఈ చర్యలు చేశామని, ఇప్పుడు దాని ఫలితాలు అనుభవిస్తున్నామని తెలిపారు

Khawaja Asif: అవును ఉగ్రవాదాన్ని పెంచి పోషించాం

  • అమెరికా, బ్రిటన్‌ కోసమే ఈ చెత్తపనులు

  • పొరపాటు గ్రహించాం.. అనుభవిస్తున్నాం

  • పాక్‌ రక్షణ మంత్రి ఖవాజా సంచలన వ్యాఖ్యలు

ఉగ్రవాదం విషయంలో దాయాది దేశం తన ముసుగు తానే తొలగించుకుంది. ‘అవును.. ఉగ్రవాదులకు మా గడ్డపై శిక్షణ, నిధులు అందిస్తున్నాం’ అంటూ పాకిస్థాన్‌ రక్షణ మంత్రి ఖవాజా అసిఫ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమదేశాల కోసం ముఫ్ఫై ఏళ్లుగా ఈ చెత్త పనులు తాము చేస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు. ‘స్కై న్యూస్‌.ఇన్‌’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. పాక్‌ నిజ స్వరూపాన్ని ఆయన బయటపెట్టేశారు. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడటానికే ఇదంతా చేశామనే అర్థం వచ్చేలా ఆయన మాట్లాడారు. ‘‘నిజమే, మేం ఈ చెత్త పనులను (ఉగ్రవాదులకు నిధులు, శిక్షణ) అమెరికా, బ్రిటన్‌ సహా పశ్చిమదేశాల కోసం చేశాం’’ అని ఖవాజా తెలిపారు. ఇంతలోనే సర్దుకుని, ఆ పొరపాటును గ్రహించామని, దాని ఫలితాన్ని కూడా అనుభవిస్తున్నామని చెప్పారు.


పహల్గాం దాడి తమ పనేనని లష్కరే తాయిబా అనుబంధ సంస్థ ద రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌ ప్రకటించుకుంది. దీనిపై వేసిన ప్రశ్నకు ఖవాజా స్పందిస్తూ.. లష్కరే తాయిబా ఇప్పుడు పాక్‌లో ఉనికిలో లేదని, రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌ అనే సంస్థ పేరు విననే లేదని చెప్పే ప్రయత్నం చేశారు. ఈ దాడిని పురస్కరించుకుని పాక్‌పై రక్షణ చర్యలకు భారత్‌ ఉపక్రమిస్తోందంటూ ఆయన ఎదురుదాడికి ప్రయత్నించారు. తమ భూభాగంలో భారత్‌ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందంటూ నోరు పారేసుకున్నారు.


Bihar: మా నాన్నే మళ్లీ సీఎం, నో డౌట్

Rekha Gupta: ప్రైవేట్ స్కూళ్లకు సీఎం స్ట్రాంగ్ వార్నింగ్

Tahawwur Rana: ప్రతీ రోజు 8 నుంచి 10 గంటల పాటు విచారణ..

BJP: హిమాలయాలకు అన్నామలై.. బాబా గుహలో ధ్యానం

Updated Date - Apr 26 , 2025 | 04:33 AM