Pakistan Ceasefire Violation: పాక్ కాల్పుల ఉల్లంఘనలు.. భారత్ వార్నింగ్
ABN , Publish Date - May 10 , 2025 | 11:14 PM
పాక్ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడటంపై భారత్ మండిపడింది. పాక్ కవ్వింపులకు దీటుగా స్పందించేందుకు ఆర్మీకి స్వేచ్ఛ ఇచ్చినట్టు విదేశాంగ శాఖ సెక్రెటరీ పేర్కొన్నారు.
కాల్పుల విరమణకు అంగీకరించిన కొద్ది సేపటికే పాక్ మళ్లీ తన పాత బుద్ధి ప్రదర్శించడంపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఉల్లంఘనలపై భారత విదేశాంగ శాఖ సెక్రెటరీ విక్రమ్ మిశ్రీ తాజాగా పత్రికా సమావేశం నిర్వహించారు. నియంత్రణ రేఖతో పాటు అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి పాక్ కాల్పుల ఉల్లంఘనలకు పాల్పడినట్టు తెలిపారు. అవగాహన ఒప్పందం కుదిరిన కొద్ది గంటలకే ఉల్లంఘనలకు దిగడం సరికాదని అన్నారు.
కొన్ని గంటలుగా పాక్ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని ఇది అత్యంత దుర్మార్గమని ఖండించారు. డీజీఎమ్ఓల మధ్య కుదిరిన ఒప్పందాన్ని ఉల్లంఘించడం సరికాదని అన్నారు. ఆర్మీ దుశ్చర్యలను నియంత్రించుకోవాలని పాక్ ప్రభుత్వానికి హితవు పలికారు. కాగా, పాక్ దుర్మార్గానికి తగిన విధంగా జవాబిచ్చేందుకు ఆర్మీకి స్వేచ్ఛ ఇచ్చామని అన్నారు.
ఇవి కూడా చదవండి
కాల్పుల విరమణకు అంగీకరించాం: పాకిస్థాన్
భారత్, పాకిస్తాన్ యుద్ధంపై జాన్వీ ఎమోషనల్ పోస్ట్..
భారత్, పాక్ యుద్ధం అప్‌డేట్స్ మీ ఫోన్లో చూడాలనుకుంటే ఇలా చేయండి..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి