Share News

Pak Ceasefire Violation: సీజ్‌ఫైర్‌కు అంగీకరించిన కొద్ది సేపటికే ఉల్లంఘనలు.. పాక్‌లో ఏం జరుగుతోంది

ABN , Publish Date - May 10 , 2025 | 10:59 PM

సీజ్‌ఫైర్‌కు అంగీకరించిన కొద్ది సేపటికే పాక్ ఆర్మీ మళ్లీ కాల్పుల ఉల్లంఘనలకు తెగబడటంతో అక్కడ ఏం జరుగుతోందన్న చర్చ సర్వత్రా జరుగుతోంది.

Pak Ceasefire Violation: సీజ్‌ఫైర్‌కు అంగీకరించిన కొద్ది సేపటికే ఉల్లంఘనలు.. పాక్‌లో ఏం జరుగుతోంది
Pak Ceasefire Violation

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌తో కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో పాక్ ప్రధాని హర్షం వ్యక్తం చేశాడు. అమెరికాకు ధన్యవాదాలు కూడా తెలిపాడు. ఇది కొత్త అధ్యయనానికి నాంది అని కూడా ప్రకటించుకున్నారు. ఇంతలోనే పాక్ ఉల్లంఘనలకు పాల్పడింది. భారత భూభాగాలపై దాడికి తెగ బడింది. దీంతో, పాక్‌లో ఏం జరుగుతోందన్న చర్చ మొదలైంది. పాక్‌లో రాజకీయ పరిస్థితిపై పలు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కాల్పుల విరమణ విషయంలో ప్రధాని, ఆర్మీ చీఫ్ మునీర్ మధ్య ఏకాభిప్రాయం లేదా అని కొందరు ప్రశ్నిస్తున్నారు.

పాక్ పరిస్థితిలు ఏ క్షణంలో ఎటువైపు అయినా మళ్లొచ్చని పరిశీలకులు చెబుతున్నారు. భారత్‌తో యుద్ధం వస్తే పాక్ ప్రజలపై తన పట్టు పెంచుకునేందుకు, పోగొట్టుకున్న గౌరవమర్యాదలను తిరిగిపొందేందుకు ఓ అవకాశం వస్తుందని ఆర్మీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. పాక్‌లో అత్యంత ప్రజాదరణ కలిగిన ఇమ్రాన్ ఖాన్ జైలు పాలు కావడంతో ప్రజల్లో పాక్ మిలిటరీపై అసంతృప్తి పెల్లుబుకుతోంది.


ఈ సమయంలో భారత్‌తో యుద్ధం వస్తే దేశ సంరక్షణ శక్తిగా తమని తాము ప్రజల ముందు నిలుపుకోవచ్చని పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ భావిస్తున్నారని అక్కడి విశ్లేషకులు చెబుతున్నారు. పాక్ లోని సెంట్రల్ పంజాబ్‌లో ప్రజాభిప్రాయం మారితే మిలిటరీ పాప్యులారిటీ మళ్లీ మారుతుంది.. దీంతో, మరోసారి దేశాన్ని తన పిడికిలిలో బిగించే అవకాశం పాక్‌ ఆర్మీకి చిక్కుతుంది అని అంటున్నారు. భారత్‌తో ప్రస్తుతం నెలకొన్ని ఉద్రిక్తతలను పాక్ ఆర్మీ ఓ అవకాశంగా భావిస్తోందని అంటున్నారు.

ఇప్పటికే పాక్ ఆర్మీకి అనుకూలంగా ప్రధాన మీడియాతో పాటు సోషల్ మీడియాలో కూడా ప్రచారం ఎక్కువవుతోంది. ఫలితంగా ప్రజల్లో ఆర్మీకి మళ్లీ సానుకూలత పెరుగుతోందని అక్కడి విశ్లేషకులు భావిస్తున్నారు.


ఇవి కూడా చదవండి

కాల్పుల విరమణకు అంగీకరించాం: పాకిస్థాన్

భారత్, పాకిస్తాన్ యుద్ధంపై జాన్వీ ఎమోషనల్ పోస్ట్..

భారత్, పాక్ యుద్ధం అప్‌డేట్స్ మీ ఫోన్లో చూడాలనుకుంటే ఇలా చేయండి..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 10 , 2025 | 11:01 PM