Sheikh Sajjad Ahmad: కర్ణాటక, కేరళలో చదివి ఉగ్రవాదం వైపు
ABN , Publish Date - May 09 , 2025 | 05:32 AM
పహల్గామా ఉగ్రదాడి సూత్రధారి షేక్ సజ్జద్ అహ్మద్ కర్ణాటక, కేరళలో విద్యాభ్యాసం చేశాడు. లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ అనుబంధ టీఆర్‌ఎఫ్‌లో కీలక పాత్ర పోషించినట్లు సమాచారం.
పహల్గాం దాడి సూత్రధారి షేక్ సజ్జద్ అహ్మద్‌పై పోలీసుల ఆరా
బెంగళూరు, మే 8 (ఆంధ్రజ్యోతి): పహల్గాం ఉగ్రదాడి సూత్రధారి షేక్ సజ్జద్ గుల్ అలియాస్ సజ్జద్ అహ్మద్ షేక్ కర్ణాటక, కేరళలో ఉన్నత విద్యాభ్యాసం చేసినట్లు తెలిసింది. లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ అనుబంధ టీఆర్‌ఎఫ్‌లో సజ్జద్ కీలకమని తెలుస్తోంది. బెంగళూరు, కేరళల్లో విద్యాభ్యాసం తర్వాత కశ్మీరులో సొంతంగా డయాగ్నస్టిక్ ల్యాబ్‌ను తెరిచి, అక్కడి నుంచే ఉగ్రవాదులకు సరుకులు రవాణా చేసేవాడని తెలిసింది. ఆ సంబంధాలతోనే లష్కరే తోయిబా ద్వారా పాక్ చేరుకుని ఐఎ్‌సఐ కోసం పనిచేస్తున్నట్లు సమాచారం. ఈనేపథ్యంలోనే సజ్జద్ గురించి ఆ రాష్ట్రాల పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.