Operation Sindhu: ఇరాన్ నుంచి 310 మంది భారతీయులతో ఢిల్లీ చేరిన మరో విమానం
ABN , Publish Date - Jun 21 , 2025 | 08:03 PM
యుద్ధం, ఉద్రిక్తతల నడుమ తమకు సురక్షితంగా తీసుకువచ్చిన భారత ప్రభుత్వానికి విమానాశ్రయానికి చేరుకున్న విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఇరాన్ నుంచి తమను తరలించేటప్పుడు చక్కటి వసతి, లంచ్, డిన్నర్ వంటివన్నీ సకాలంలో అందించారని, తిరిగి స్వదేశానికి రావడం సంతోషంగా ఉందని అల్మాస్ రిజ్వి అనే స్టూడెంట్ తెలిపారు.
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం కొనసాగుతుండటంతో ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు భారత ప్రభుత్వం చేపట్టిన 'ఆపరేషన్ సింధు' (Operation Sindhu) కొనసాగుతోంది. ఇందులో భాగంగా మరో ప్రత్యేక విమానం ట్రెహ్రాన్ (Tehran) నుంచి శనివార సాయంత్రం న్యూఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సురక్షితంగా చేరుకుంది. ఇందులో 310 మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. వీరందరికీ వారి కుటుంబ సభ్యులు, అధికారులు సాదర స్వాగతం పలికారు. దీంతో 827 మంది భారతీయులను ఇప్పటివరకూ సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చినట్టు కేంద్ర విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో తెలిపారు.
యుద్ధం, ఉద్రిక్తతల నడుమ తమకు సురక్షితంగా తీసుకువచ్చిన భారత ప్రభుత్వానికి విమానాశ్రయానికి చేరుకున్న విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఇరాన్ నుంచి తమను తరలించేటప్పుడు చక్కటి వసతి, లంచ్, డిన్నర్ వంటివన్నీ సకాలంలో అందించారని, తిరిగి స్వదేశానికి రావడం సంతోషంగా ఉందని అల్మాస్ రిజ్వి అనే స్టూడెంట్ తెలిపారు. ఇండియన్ ఎంబసీ ఎంతో సాయం చేసిందని, బారత ప్రభుత్వం తమపట్ల చాలా శ్రద్ధ తీసుకుందని చెప్పారు.
కాగా, ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా ఈనెల 20వ తేదీన ఇరాన్ నుంచి 290 మంది విద్యార్థులు ఢిల్లీకి చేరుకున్నారు. ఇరాన్ ప్రభుత్వం భారతీయుల కోసం గగనతలాన్ని తెరవడంతో పాటు అక్కడి నుంచి విమానాల ద్వారా సుమారు వెయ్యి మంది భారతీయులను తరలించేందుకు అనుమతించింది. దీనికి ముందు జూన్ 19న 110 మంది భారతీయ విద్యార్థులు అర్మేనియా, దోహా మీదుగా ఢిల్లీకి చేరుకున్నారు.
ఇవి కూడా చదవండి..
కూర్పు మనది.. లాభాలు చైనావి.. మేక్ ఇన్ ఇండియాపై రాహుల్ విసుర్లు
సింధు జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించం...తేల్చిచెప్పిన అమిత్‌షా
For National News And Telugu News