Ahead Of New Year: న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ సందర్భంగా పోలీసుల ఉక్కుపాదం.. ఒకే రోజు 600 మంది అరెస్ట్
ABN , Publish Date - Dec 27 , 2025 | 05:57 PM
ఢిల్లీ పోలీసులు ‘ఆపరేషన్ అఘాత్ 3.0’ను మొదలుపెట్టారు. నేరాలకు పాల్పడుతున్న క్రిమినల్స్‌ను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. నిన్న ఒక్క రోజే సౌత్, సౌత్ ఈస్ట్ ఢిల్లీ జిల్లాల్లో 660 మందిని అరెస్ట్ చేశారు.
పలు నగరాల్లో న్యూ ఇయర్ వేడుకలు వారం రోజుల ముందే మొదలయ్యాయి. క్రిమినల్ గ్యాంగ్స్ రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నాయి. విచ్చలవిడిగా తమ దందా కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే క్రైమ్స్‌ను అరికట్టడానికి ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగారు. ‘ఆపరేషన్ అఘాత్ 3.0’ను మొదలుపెట్టారు. నేరాలకు పాల్పడుతున్న క్రిమినల్స్‌ను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. నిన్న ఒక్క రోజే సౌత్, సౌత్ ఈస్ట్ ఢిల్లీ జిల్లాల్లో 660 మందిని అరెస్ట్ చేశారు. వారినుంచి డజన్ల సంఖ్యలో ఆయుధాలు, లక్షల రూపాయల డబ్బు, అక్రమ మద్యం, డ్రగ్స్, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
న్యూ ఇయర్ సందర్భంగా క్రైమ్స్‌ను అరికట్టడానికి పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. క్రైమ్స్ అధికంగా జరిగే ప్రదేశాల్లో నిన్న ఉదయం మొదలైన సోదాలు ఈ రోజు ఉదయం వరకు కొనసాగాయి. క్రైమ్స్‌కు పాల్పడే అవకాశం ఉందని భావించే వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సౌత్, సౌత్ ఈస్ట్ జిల్లా పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించి మరీ క్రిమినల్ రికార్డులు ఉన్న వారిని అరెస్ట్ చేశారు. కేవలం ఒక్క సౌత్ ఈస్ట్ జిల్లాలో మాత్రమే ఏకంగా 285 మంది అరెస్ట్ అయ్యారు. పలు సెక్షన్ల కింద పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
ప్రొవిషన్స్ ఆఫ్ ది ఆర్మ్స్ యాక్ట్, ది ఎక్సైజ్ యాక్ట్, ఎన్‌డీపీఎస్ యాక్ట్, గ్యాంబ్లింగ్ యాక్ట్ కింద ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వారిని అరెస్ట్ చేశారు. ఆపరేషన్ అఘాత్ 3.0 భాగంగా పోలీసులు ఇప్పటి వరకు 2,800 మందిని విచారించారు. జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సెక్యూరిటీ) మీడియాతో మాట్లాడుతూ.. ‘డ్రైవ్ విజయవంతం అయింది. రెండు జిల్లాలో మొత్తం 850 మందిని అదుపులోకి తీసుకున్నాం. వీరిలో 150కిపైగా మంది చెడు ప్రవర్తన(తరచుగా నేరాలకు పాల్పడేవారు) కలిగిన వారు ఉన్నారు. ఎలాంటి గొడవలు లేకుండా న్యూ ఇయర్ వేడుకలు జరగాలి’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి
గానవి కేసులో ఊహించని ట్విస్ట్.. ఆత్మహత్య చేసుకున్న భర్త..
కన్నీటి ‘సునామీ’కి 21 యేళ్లు..