Ooty: మీరు ఊటీ వెళ్తున్నారా.. అయితే ముందుగా ఈ వార్త తెలుసుకోవాల్సిందే మరి..
ABN , Publish Date - Sep 17 , 2025 | 11:19 AM
ఊటీకి నిషేధిత ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లతో వచ్చిన కర్ణాటక రాష్ట్రం చిక్‌మంగలూరు మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్లు, చిక్‌మంగళూరు ఎమ్మెల్యే తదితరలకు ఊటీ మున్సిపల్ అధికారులు జరిమాన విధించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
- ఊటీలో ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు.. కర్ణాటక అధికారులకు జరిమానా
చెన్నై: ఊటీ(Ooty)కి నిషేధిత ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లతో వచ్చిన కర్ణాటక రాష్ట్రం చిక్‌మంగలూరు మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్లు, చిక్‌మంగళూరు ఎమ్మెల్యే తదితరలకు ఊటీ మున్సిపల్ అధికారులు(Ooty Municipal officials) జరిమాన విధించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిగక్‌మంగళూరు మున్సిపాలిటీ అధికారులు ఊటీలో అమలవుతున్న వ్యర్థాల తొలగింపు పనులను పరిశీలించేందుకు కొద్ది రోజుల క్రితం వచ్చారు.

బస్సులో వచ్చిన ఆ అధికారులు ఊటీలో నిషేధిత ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను తీసుకు వచ్చినట్లు ఊటీ మున్సిపాలిటీ అధికారులకు సమాచారం అందింది. వెంటనే ఊటీ మున్సిపాలిటీ సిబ్బంది ఆ బస్సులో తనిఖీ చేసి 60 ప్లాస్టిక్ వాటర్‌బాటిళ్ళను చిక్‌మంగళూరు మున్సిపల్ అధికారులు వెంట తీసుకువచ్చినట్లు వెల్లడైంది. దీనితో ఒక్కో బాటిల్ రూ.100ల చొప్పున రూ.6 వేల జరిమానా విధించారు.

బస్సులో వచ్చిన ఆ అధికారులు ఊటీలో నిషేధిత ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను తీసుకు వచ్చినట్లు ఊటీ మున్సిపాలిటీ అధికారులకు సమాచారం అందింది. వెంటనే ఊటీ మున్సిపాలిటీ సిబ్బంది ఆ బస్సులో తనిఖీ చేసి 60 ప్లాస్టిక్ వాటర్‌బాటిళ్ళ(Plastic water bottles)ను చిక్‌మంగళూరు మున్సిపల్ అధికారులు వెంట తీసుకువచ్చినట్లు వెల్లడైంది. దీనితో ఒక్కో బాటిల్ రూ.100ల చొప్పున రూ.6 వేల జరిమానా విధించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అది నేలకొండపల్లి ఎందుకు కాకూడదు!?
సిందూర్ తో మసూద్ కుటుంబం చిన్నాభిన్నం
Read Latest Telangana News and National News