Share News

Chennai News: ఊటీలో వాటర్‌ బాటిళ్లు స్వాధీనం.. డ్రైవర్లకు రూ.26,400 జరిమానా

ABN , Publish Date - Oct 28 , 2025 | 11:53 AM

ఊటీలో వాటర్‌ బాటిల్స్‌ తీసుకొచ్చిన, పర్యాటక వాహన డ్రైవర్లకు రూ.26,400 జరిమానా విధించారు. నీలగిరి జిల్లాలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా జిల్లా యంత్రాంగం, లీటరు, రెండు లీటర్ల వాటర్‌ బాటిల్స్‌, కూల్‌ డ్రింక్స్‌ బాటిల్స్‌ తదితర ప్లాస్టిక్‌ వస్తువులను నిషేధం విధించింది.

Chennai News: ఊటీలో వాటర్‌ బాటిళ్లు స్వాధీనం..  డ్రైవర్లకు రూ.26,400 జరిమానా

చెన్నై: ఊటీ(Ooty)లో వాటర్‌ బాటిల్స్‌ తీసుకొచ్చిన, పర్యాటక వాహన డ్రైవర్లకు రూ.26,400 జరిమానా విధించారు. నీలగిరి(Neelagiri) జిల్లాలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా జిల్లా యంత్రాంగం, లీటరు, రెండు లీటర్ల వాటర్‌ బాటిల్స్‌, కూల్‌ డ్రింక్స్‌ బాటిల్స్‌ తదితర ప్లాస్టిక్‌ వస్తువులను నిషేధం విధించింది. జిల్లాకు వచ్చే పర్యాటకుల వాహనాలను చెక్‌పోస్ట్‌ వద్ద తనిఖీ చేస్తున్న అధికారులు, ప్రయాణికులు తీసుకొచ్చే వాటర్‌, కూల్‌డ్రింక్స్‌ బాటిల్స్‌(Water, Cool Drinks) స్వాధీనం చేసుకుంటున్నారు.


nani4.2.jpg

ఈ నేపథ్యంలో, ఊటీ తహసీల్దార్‌ శంకర్‌ గణేష్‌ నేతృత్వంలోని రెవెన్యూ అధికారుల బృందం బొటానికల్‌ గార్డెన్‌ ప్రాంతంలోని పార్కింగ్‌ చేసిన కేరళ, కర్ణాటక(Kerala, Karnataka) సహా పలు రాష్ట్రాల నుంచి వచ్చిన పర్యాటక వాహనాల్లో నిషేధించిన 264 బాటర్‌ బాటిల్స్‌ స్వాధీనం చేసుకుని, వాహనాల డ్రైవర్లకు రూ.24,600 జరిమానా విధించారు.


nani4,3.jpg

ఈ వార్తలు కూడా చదవండి..

వరుసగా రెండో రోజూ తగ్గిన గోల్డ్ రేట్స్

నేడు, రేపు భారీ వర్షాలు

Read Latest Telangana News and National News

Updated Date - Oct 28 , 2025 | 11:53 AM