Onions: పడిపోయిన ఉల్లి ధర.. కిలో ఎంతంటే..
ABN , Publish Date - Oct 02 , 2025 | 12:21 PM
మార్కెట్‌లో ఉల్లిపాయల ధర ఒక్కసారిగా తగ్గిపోవడం రైతులకు నిరాశను మిగిల్చింది. జిల్లాలోని దేవదుర్గ తాలూకా అరకెరాకు చెందిన రైతు ఒకరు వారం రోజుల క్రితం ఉల్లిపాయ పంటను రాయచూరు ఏపీఎంసీ మార్కెట్ కు తీసుకురాగా ధర పూర్తిగా పడిపోవడంతో వారం రోజులుగా పడియావులు పడుతున్నాడు.
- వారం రోజులుగా ఏపీఎంసీలోనే రైతు ఎదురుచూపు
రాయచూరు(బెంగళూరు): మార్కెట్‌లో ఉల్లిపాయల(Onions) ధర ఒక్కసారిగా తగ్గిపోవడం రైతులకు నిరాశను మిగిల్చింది. జిల్లాలోని దేవదుర్గ తాలూకా అరకెరాకు చెందిన రైతు ఒకరు వారం రోజుల క్రితం ఉల్లిపాయ పంటను రాయచూరు ఏపీఎంసీ మార్కెట్ కు తీసుకురాగా ధర పూర్తిగా పడిపోవడంతో వారం రోజులుగా పడియావులు పడుతున్నాడు. రెండు రోజుల క్రితం నుంచి కురుస్తున్న వర్షాల దెబ్బకు పంటను కాపాడుకునేందుకు ఆయన ఏపీఎంసీ మార్కెట్ యార్డులో నానా అవస్థలు పడుతున్నాడు.

లక్షల రూపాయిలు ఖర్చు చేసి పండించుకున్న పంటకు సరైన గిట్టుబాటు ధర లేకపోవడంతో దసరా పండుగ(Dussehra festival)ను కూడా సంతోషంగా జరుపుకోలేకపోతున్నట్లు రైతు ఆవేదనతో చెప్పారు. మంగళవారం తన రాసుల మధ్యనే కాలం వెళ్లదీస్తున్న రైతు దసరా పండుగ రోజైనా తనకు మంచి ధర లభిస్తుందేమోనన్న ఆశతో ఎదురు చూస్తున్నాడు.
ఈ వార్తలు కూడా చదవండి..
బంగారం ధర తగ్గేదేలే.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
టాప్ ప్లేస్‌లో అంబానీ.. దేశంలో అత్యంత సంపన్నులు వీరే..
Read Latest Telangana News and National News