Ola engineer death: బెంగళూరు ఓలా ఇంజినీర్ ఆత్మహత్య.. సీఈవోపై కేసు నమోదు..
ABN , Publish Date - Oct 21 , 2025 | 11:30 AM
ఎలక్ట్రిక్ బైక్‌ల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ బెంగళూరు ఆఫీస్‌లో షాకింగ్ ఘటన జరిగింది. సీనియర్ల వేధింపులు తట్టుకోలేక ఓ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు 28 పేజీల మరణ వాంగ్మూలం రాశాడు. దీంతో ఓలా సంస్థ సీఈవో భవీశ్ అగర్వాల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఎలక్ట్రిక్ బైక్‌ల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ బెంగళూరు ఆఫీస్‌లో షాకింగ్ ఘటన జరిగింది. సీనియర్ల వేధింపులు తట్టుకోలేక ఓ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు 28 పేజీల మరణ వాంగ్మూలం రాశాడు. దీంతో ఓలా సంస్థ సీఈవో భవీశ్ అగర్వాల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టారు (Bhavish Aggarwal FIR).
బెంగళూరుకు చెందిన అరవింద్ (38) అనే వ్యక్తి ఓలా ఎలక్ట్రిక్ సంస్థలో 2022 నుంచి ఉద్యోగం చేస్తున్నాడు. సెప్టెంబర్ 28వ తేదీన అతడు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్నేహితులు వెంటనే అతడిని గుర్తించి హాస్పిటల్‌కు తరలించారు. అయితే అతడు చికిత్స పొందుతూ అదే రోజు మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. అరవింద్ మరణించిన గదిలో అతడి సోదరుడికి సూసైడ్ నోట్ దొరికింది (Bengaluru tech death).
ఓలా సీఈవో భవీశ్ అగర్వాల్, సీనియర్ ఉద్యోగి సుభ్రాత్ కుమార్ దాస్ తనను మానసికంగా వేధించారని ఆ 28 పేజీల మరణ వాంగ్మూలంలో అరవింద్ పేర్కొన్నాడు. జీతం సరిగ్గా ఇవ్వకుండా వేధించారని ఆ లేఖలో అరవింద్ పేర్కొన్నాడు. అరవింద్ మరణించిన తర్వాత అతడి బ్యాంక్ ఖాతాకు ఓలా సంస్థ నుంచి దాదాపు 17.50 లక్షల రూపాయలు బదిలీ అయ్యాయి. ఈ ట్రాన్సాక్షన్ గురించి ఓలా సంస్థను అరవింద్ సోదరుడి ప్రశ్నించగా వారి నుంచి సమాధానం రాలేదు. దీంతో అరవింద్ మృతిపై అనుమానాలు మొదలయ్యాయి (Ola workplace harassment).
అరవింద్ సూసైడ్ నోట్‌ను పోలీసులకు ఇచ్చిన అతడి సోదరుడు ఫిర్యాదు చేశాడు (Ola CEO news). దీంతో ఓలా సంస్థ సీఈవో భవీశ్ అగర్వాల్‌పై పోలీసులు ఈ నెల 6వ తేదీన కేసు నమోదు చేశారు. ఈ పోలీస్ కేసుపై ఓలా సంస్థ స్పందించింది. అరవింద్ మృతికి సంతాపం తెలిపింది. భవీశ్ అగర్వాల్‌పై నమోదైన కేసును హైకోర్టులో తాజాగా సవాల్ చేసింది. కుటుంబానికి తక్షణ మద్దతు అందించడం కోసమే అరవింద్ అకౌంట్‌కు డబ్బులు బదిలీ చేశామని ఓలా సంస్థ చెబుతోంది.
ఇవి కూడా చదవండి..
డీల్ ఆర్ నో డీల్.. చైనా ఒప్పుకోకపోతే 155 శాతం సుంకాలు.. ట్రంప్ బెదిరింపు..
స్వల్పంగా తగ్గింది.. మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
మరిన్ని తాజా వార్తలు కోసం క్లిక్ చేయండి..