Notices: 255 మంది అధికారులకు నోటీసులు.. విషయం ఏంటంటే..
ABN , Publish Date - Jan 17 , 2025 | 11:56 AM
ప్రభుత్వ అధికారుల పనితీరుపై జిల్లాలో 95 ఫిర్యాదులు నమోదు కాగా, వాటిని ఈ నెల 18వ తేదీన ఉప లోకాయుక్త అధికారి జస్టిస్ బి.వీరప్ప(Justice B. Veerappa) విచారించనున్నారు. వివిధ శాఖలకు చెందిన 255 మందిపై అధికారులు 95మంది లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు.

- రేపు విచారించనున్న ఉపలోకాయుక్త
బళ్లారి(బెంగళూరు): ప్రభుత్వ అధికారుల పనితీరుపై జిల్లాలో 95 ఫిర్యాదులు నమోదు కాగా, వాటిని ఈ నెల 18వ తేదీన ఉప లోకాయుక్త అధికారి జస్టిస్ బి.వీరప్ప(Justice B. Veerappa) విచారించనున్నారు. వివిధ శాఖలకు చెందిన 255 మందిపై అధికారులు 95మంది లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. వీరందరికి జిల్లా లోకాయుక్త ఎస్పీ ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ఈ నెల 18వ తేదీన జరగనున్న ఉప లోకాయుక్త విచారణలో నోటీసులు అందుకున్న అధికారులు, ఆయా శాఖల ప్రధాన అధికారులు విచారణకు హాజరు కావాల్సి ఉందని నోటీసులో సూచించారు.
ఈ వార్తను కూడా చదవండి: Hero Darshan: గన్ లైసెన్స్ ఇవ్వండి ప్లీజ్..
అన్ని కేసులు విచారణ జరపనున్న ఉప లోకాయుక్త అధికారి అదేరోజు ఆదేశాలు జారీ పిర్యాదులు పరిష్కరించనున్నట్లు సమాచారం. చాలా వరకు కేసులు ఇప్పటికే విచారణ జరిగాయి. ఇంకా కొన్నికేసులు విచారణ చేయాల్సి ఉంది. ఉప లోకాయుక్త అధికారి బళ్ళారి పర్యటన నేపథ్యంలో జిల్లా పాలనామండలికి చురుకు ముట్టినట్లు అయింది. లోకాయుక్త అధికారులు ఏ ప్రభుత్వ కార్యాలయానికి ఎపుడు వస్తారోనని అధికారుల గుండెల్లో రైళ్ళు పరుగెడుతున్నాయి. దీంతో రాత్రిపగలు తేడాలేకుండా ఆఫీసుల్లో పైళ్ళు సర్దేపనిలో నిమగ్నమయ్యారు.
జిల్లాధికారి ఆధ్వర్యంలో ఇప్పటికే వివిధ శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహించి కార్యాలయాల్లో ఎలాంటి దోషాలు తలెత్తకుండా చూసుకోవాలని అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది. దీంతో క్రింది స్థాయి ఉద్యోగులు, సిబ్బందికి కార్యాలయం ముఖ్యస్తులు విశ్రాంతి లేకుండా పనులు చేయిస్తున్నారు. గురువారం ఉపలోకాయుక్త అధికారి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. తెల్లవారు జామున బళ్ళారి ఏపీఎంసీ, జిల్లా ఆసుపత్రి, తాసీల్దారు కార్యాలయం, బళ్ళారి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కళాశాల(బిమ్స్)లో రోగులకు అందుతున్న వైద్యసేవలు గురించి పర్యవేక్షించడం గమనార్హం.
జిల్లాస్థాయిలో అధికారులు, ప్రజా ప్రతినిధులు అవినీతికి సంబంధించి 30 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు, ఇందులో 15ఏళ్ళ క్రితం నమోదైన కేసులు ఉన్నట్లు తెలిసింది. కొన్నికేసులకు సంబంధించి చార్జ్‌షీట్ వేసేందుకు సంబంధిత అధికారుల నుండి అనుమతి కోరినట్లు తెలిసింది. కొన్ని అభ్యర్థులు తిరస్కరించగా, కొన్ని అభ్యర్థలు మంజూరు చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం. ఇటీవల జరిగిన శాసనసభ సమావేశాల్లో ఒక ప్రశ్నకు ప్రభుత్వం ఇచ్చిన సమాధానంలో ఈ వాస్తవాలు వెలుగుచూశాయి కేసుల స్వరూపం భిన్నంగా ఉండడంతో 18న విచారణ జరగనుందని అధికారుల సమాచారం.
ఈవార్తను కూడా చదవండి: Road Accident: తల్లీకుమార్తెను బలిగొన్న పొగమంచు
ఈవార్తను కూడా చదవండి: రైతు భరోసా గురించి మంత్రి పొంగులేటి ఏం చెప్పారంటే..
ఈవార్తను కూడా చదవండి: రైతు భరోసా కోసం దరఖాస్తు.. డిప్యూటీ సీఎం చెప్పింది ఇదే
ఈవార్తను కూడా చదవండి: TG News: తెలంగాణను వణికిస్తున్న పులులు
Read Latest Telangana News and National News