Disability Rights: అంగవైకల్యం జాబితాలో ఆ తొమ్మిది వ్యాధులు అవసరం లేదన్న కమిటీ
ABN , Publish Date - Sep 03 , 2025 | 03:16 AM
వికలాంగుల హక్కుల చట్టంలోని అంగవైకల్యం జాబితాలో మరో తొమ్మిది అనారోగ్య కారకాలు/వ్యాధులు చేర్చాలంటూ వచ్చిన ప్రతిపాదనను...
న్యూఢిల్లీ, సెప్టెంబరు 2: వికలాంగుల హక్కుల చట్టంలోని అంగవైకల్యం జాబితాలో మరో తొమ్మిది అనారోగ్య కారకాలు/వ్యాధులు చేర్చాలంటూ వచ్చిన ప్రతిపాదనను కేంద్ర కమిటీ తిరస్కరించింది. హిమోఫీలియా, మూర్ఛవ్యాధి, పల్మోప్లాంటర్ కెరటోడెర్మా, ఇక్తయోసి్‌స, ఒక వైపు వినికిడి లోపం, లారింజెక్టమీ, ముఖ్య అవయవ వైఫల్యం, ఒస్టమి, ఆస్తమాలను చట్టంలో కొత్తగా చేర్చాలా? వద్దా? అన్న అంశంపై కమిటీ సుదీర్ఘంగా చర్చించింది. అయితే పైవాటికి ఇప్పటికే అందుబాటులో ఉన్న సంక్షేమ పథకాలను వర్తింపజేస్తున్నందున వాటిని వికలాంగుల హక్కుల చట్టంలో చేర్చవలసిన అవసరం లేదని భావించింది
ఈ వార్తలు కూడా చదవండి..
మణిపూర్‌లో పర్యటించనున్న ప్రధాని మోదీ..!
ఏపీ మహేష్ బ్యాంక్‌కు షాక్ ఇచ్చిన ఈడీ
For More National News And Telugu News