Minister: తేల్చిచెప్పేశారు.. బస్సు ఛార్జీలు పెంచం
ABN , Publish Date - Jun 04 , 2025 | 11:28 AM
ఎట్టి పరిస్థితుల్లోనూ బస్సు ఛార్జీలు పెంచే ప్రసక్తే లేదని మంత్రి శివశంకర్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... బస్సు చార్జీలు పెరుగుతాయని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఆ ప్రచారం అంతా అబద్దమన్నారు.
- రవాణాశాఖ మంత్రి శివశంకర్
చెన్నై: బస్సు ఛార్జీలు పెంచే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి శివశంకర్(Minister Shivshankar) మరోమారు స్పష్టం చేశారు. గత రెండు,మూడు రోజులుగా సోషల్ మీడియాలో రాష్ట్రంలో బస్సు ఛార్జీలు పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనే కథనాలపై మంత్రి శివశంకర్ స్పందించారు. ఆయన అరియలూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బస్సు ఛార్జీలు పెంచుతున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న కథనాల్లో వాస్తవం లేదన్నారు.
ప్రైవేటు బస్సుల యజమానులు ఛార్జీలు పెంచాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారని, న్యాయస్థానం సూచన మేరకు ప్రైవేటు బస్సు ఛార్జీలు పెంచడంపై ప్రజాభిప్రాయం తెలుసుకుని నివేదిక అందజేయాలని రాష్ట్రప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించిందని అయితే, కొన్ని మీడియా సంస్థలు బస్సు ఛార్జీలు పెంచుతున్నట్లు తప్పుడు కథనాలు ప్రసారం చేశాయని మంత్రి తెలిపారు.

కేంద్రప్రభుత్వం డీజిల్ ధరను పలుసార్లు పెంచినప్పటికీ రాష్ట్రంలో ప్రభుత్వ రవాణా సంస్థలు బస్సు ఛార్జీలు పెంచలేదన్నారు. పది రోజుల క్రితం రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపు ఉండదని ముఖ్యమంత్రి స్టాలిన్ స్పష్టంచేశారని, ఆ రీతిలోనే బస్సు ఛార్జీల పెంపు కూడా ఉండబోదని మంత్రి శివశంకర్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి.
అమెరికాలో తెలుగు విద్యార్థులకు అండగా ఉంటాం
బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనం ఖాయం
Read Latest Telangana News and National News