Nitin Gadkari Responds: నా మేధస్సు విలువ నెలకు 200 కోట్లు
ABN , Publish Date - Sep 15 , 2025 | 06:00 AM
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన హరిత ఇంధనం ‘ఇథనాల్(ఈ)-20’లో ముడుపులు ముట్టాయని, వ్యక్తిగత లబ్ధి చేకూరిందని తనపై వస్తున్న విమర్శలకు కేంద్ర ఉపరితల...
నాగ్‌పూర్, సెప్టెంబరు 14: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన హరిత ఇంధనం ‘ఇథనాల్(ఈ)-20’లో ముడుపులు ముట్టాయని, వ్యక్తిగత లబ్ధి చేకూరిందని తనపై వస్తున్న విమర్శలకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పరోక్షంగా స్పందించారు. తాను దొడ్డిదారుల్లో సంపాయించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. తన మేధస్సు విలువ నెలకు రూ.200 కోట్లని, నిజాయితీగా ఆర్జిస్తున్నానని చెప్పారు. తనకు డబ్బుకు లోటు లేదన్నారు. చవక, ప్రత్యామ్నాయ ఇంధన వనరుగా కేంద్ర ప్రభుత్వం ఇథనాల్ కలిపిన పెట్రోల్‌ను ప్రోత్సహిస్తోంది. అయితే.. గడ్కరీ కుమారుడి నేతృత్వంలో రెండు ప్రముఖ ఇథనాల్ కంపెనీలు నడుస్తున్నాయి. దీనిని ప్రస్తావిస్తూ ఇటీవల సోషల్ మీడియాలో విమర్శలు చెలరేగాయి. తాజాగా నాగ్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన గడ్కరీ ఈ విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. తన కుమారుడికి పలు సూచనలు, సలహాలు మాత్రమే ఇస్తానని, తప్పుడు పనులు చేయమని ఎప్పటికీ చెప్పనని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
అస్సాంలో 5.8 తీవ్రతతో భూకంపం.. బెంగాల్‌లోనూ ప్రకంపనలు
నేను శివ భక్తుడిని, నేను విషం అంతా మింగేస్తాను
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి