Nehal Modi: అమెరికాలో నీరవ్ మోదీ తమ్ముడి అరెస్టు
ABN , Publish Date - Jul 06 , 2025 | 02:54 AM
పరారీలో ఉన్న ఆర్థికనేరగాడు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ తమ్ముడు నెహాల్ దీపక్ మోదీ 46ని అమెరికాలో అరెస్టు చేసినట్టు శనివారం అధికారవర్గాలు తెలిపాయి.

న్యూఢిల్లీ, జూలై 5: పరారీలో ఉన్న ఆర్థికనేరగాడు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ తమ్ముడు నెహాల్ దీపక్ మోదీ (46)ని అమెరికాలో అరెస్టు చేసినట్టు శనివారం అధికారవర్గాలు తెలిపాయి. అతడిని భారత్‌కు పంపించాలని ఈడీ, సీబీఐలు చేసిన విజ్ఞప్తి మేరకు శుక్రవారం అమెరికా పోలీసులు అరెస్టు చేసినట్టు పేర్కొన్నాయి. అతడిని అదుపులో తీసుకునే విషయమై ఇంటర్‌పోల్ ఇదివరకే రెడ్ నోటీసు జారీ చేసింది. నెహాల్ మోదీ కేసుపై ఈ నెల 17న కోర్టులో తదుపరి విచారణ జరగనుంది.
వజ్రాల వ్యాపారంలో మోసం చేశాడన్న కేసులో దాదాపు మూడేళ్లు జైలు శిక్ష అనుభవించిన నెహాల్ గురువారమే విడుదలయ్యాడు. వెంటనే మనీలాండరింగ్ కేసులో పోలీసులు అరెస్టు చేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ.13వేల కోట్ల మేర మోసగించిన కేసులో నీరవ్‌మోదీతో పాటు ఆయన మేనమామ మెహుల్ చోక్సీ ప్రధాన నిందితులుగా ఉన్నారు. వారికి సహకరించారంటూ నెహాల్‌పైనా కేసు నమోదైంది.