Share News

Lady Arrest: రూ. 5 కోట్ల డ్రగ్స్ సరఫరా, మహిళ అరెస్ట్

ABN , Publish Date - Jun 20 , 2025 | 10:31 AM

రూ.5 కోట్ల విలువైన డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఒక మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. బస్సులో మాదకద్రవ్యాలను రవాణా చేస్తున్నట్లు వచ్చిన సమాచారం ప్రకారం డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) బృందం ఆ మహిళ ప్రయాణిస్తోన్న బస్సు వెంబడి..

Lady Arrest: రూ. 5 కోట్ల డ్రగ్స్ సరఫరా, మహిళ అరెస్ట్
Lady Arrest

ముంబై, జూన్ 20: రూ.5 కోట్ల విలువైన డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఒక విదేశీ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ నుండి ముంబైకి బస్సులో మాదకద్రవ్యాలను రవాణా చేస్తున్నట్లు వచ్చిన సమాచారం ప్రకారం డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) బృందం ఆ మహిళ ప్రయాణిస్తోన్న బస్సు వెంబడి కాపు కాచి చాకచక్యంగా పట్టుకున్నారు. సదరు నైజీరియన్ మహిళను ఆపి ఆమె సామాను తనిఖీ చేశారు. ఆమె లగేజీని పరిశీలించిన తర్వాత, అధికారులు స్ఫటికాకార పదార్థపు ప్యాకెట్, ఇంకా మాత్రలు కలిగిన ఫుడ్ ప్యాకెట్లు (ఓట్స్), జ్యూస్ టెట్రా ప్యాక్‌లను స్వాధీనం చేసుకున్నారు.


NDPS ఫీల్డ్ టెస్ట్ కిట్‌ని ఉపయోగించి ల్యాబ్స్‌లో పరీక్షలు చేయగా ఆ ప్యాకెట్లలో 2.56 కిలోగ్రాముల మెథాంఫేటమిన్, 584 గ్రాముల ఎక్స్‌టసీ మాత్రలు ఉన్నట్టు నిర్ధారించారు. తదుపరి ఆపరేషన్‌లో సదరు సరుకును స్వీకరించాల్సిన వ్యక్తిని కూడా అరెస్టు చేశారు. స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాల విలువ అంతర్జాతీయ అక్రమ మాదకద్రవ్య మార్కెట్‌లో సుమారు రూ. 5 కోట్లుగా అంచనా వేశారు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (NDPS) చట్టం, 1985లోని సంబంధిత నిబంధనల కింద సరుకు తీసుకోబోయే నైజీరియన్ జాతీయుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం తదుపరి దర్యాప్తు జరుగుతోంది.


ఇవి కూడా చదవండి:

కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయతో లోకేష్ భేటీ

యోగాలో ప్రపంచ రికార్డు సృష్టిస్తాం..: మంత్రి సవిత

ఢిల్లీకి బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి

For More AP News and Telugu News

Read Latest and Crime News

Updated Date - Jun 20 , 2025 | 10:31 AM