Newlywed Bride: ఎయిర్ ఇండియా ప్రమాదం.. భర్త కోసం వెళ్తున్న నవ వధువు, అంతలోనే ట్విస్ట్..
ABN , Publish Date - Jun 12 , 2025 | 09:17 PM
పెళ్లి అనంతరం మొట్టమొదటిసారి తన భర్తను కలవబోతుందన్న ఆమె కల (Newlywed Bride) నెరవేరలేదు. ఆతృతతో, ఆనందంతో ఆమె గగనతలంలో ప్రయాణానికి సిద్ధమైంది. కానీ అంతలోనే విషాదం అలుముకుంది. చిరునవ్వుతో మొదలైన ఆ ప్రయాణం, చివరకు కన్నీటి కథగా మిగిలిపోయింది. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో ఓ నవ వధువు మరణించినట్లు తెలుస్తోంది.
అహ్మదాబాద్ (ahmedabad flight crash) నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా AI-171 విమానం, టేక్ ఆఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే నేలకొరిగింది. ఈ ఘటన ఒక్కసారిగా ఎన్నో కుటుంబాల ఆశల్ని, కలల్ని, ప్రాణాల్ని భస్మీభూతం చేసింది. అనేక మంది ప్రాణాలను రక్షించలేని విధంగా, ఈ విమాన ప్రమాదం తీవ్ర విషాదానికి నాంది పలికింది. దాదాపు 10 గంటల ప్రయాణానికి బయలుదేరిన బోయింగ్ 787-8 డ్రీంలైనర్ విమానం ఆకాశంలోకి ఎగిరింది. కానీ, గమ్యస్థానానికి చేరకముందే, ప్రయాణా ఆరంభంలోనే ఓ భారీ ప్రమాదానికి గురైంది.
ఈ ఘటనలో
ఈ విమానంలో ఖుష్బూ రాజ్ పురోహిత్ అనే నూతన వధువు (Newlywed Bride) కూడా ప్రయాణించింది. రాజస్థాన్‌లోని బలోటరా జిల్లాలోని అరాబా గ్రామానికి చెందిన ఖుష్బూ, ఈ ఏడాది జనవరిలో మన్‌ఫూల్ సింగ్‌ను వివాహం చేసుకుంది. లండన్‌లో ఉన్న భర్తను పెళ్లి తర్వాత తొలిసారిగా కలుసుకునే సంతోషం ప్రయాణించింది. కానీ అంతలోనే చివరకు తీరని విషాదంగా మారింది. గమ్యం చేరకుండానే ఆమె ఆత్మగా మారిపోయినట్లు భావిస్తున్నారు. ఆమె తండ్రి మదన్ సింగ్ రాజ్‌పురోహిత్ ఆ ఒక్క కూతురి కోసం ఇప్పుడు ఆరా తీస్తూ విలపిస్తున్నారు.
రాజస్థాన్ నుంచి ఎక్కువ
ఈ విమానంలో రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన 11 మంది ప్రయాణీకులు ఉండటం, ఆ రాష్ట్రం కోసం ఇది ఓ తీరని దురదృష్టంగా నిలిచింది. వాళ్లలో ఇద్దరు యూకేలో చెఫ్స్‌గా ఉద్యోగంలో చేరబోయే యువకులు, ఓ మార్కెట్ వ్యాపారి కుమారుడు, కుమార్తె కూడా ఉన్నారు. ఈ ఘటనతో ఒక్కసారిగా వాళ్ల కుటుంబాలన్నీ శోకంలో మునిగిపోయాయి. ప్రమాదం మధ్యాహ్నం 1:38ల తర్వాత జరిగింది. ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 242 మంది ప్రయాణీకులు ఉన్నారు. అందులో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ పౌరులు, ఒక కెనడియన్, ఏడుగురు పోర్చుగీసు పౌరులు ఉన్నారు.
హెల్ప్ లైన్ ఏర్పాటు
ఈ ప్రమాదంపై స్పందించిన ఎయిర్ ఇండియా, బాధితుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించేందుకు ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్ 1800 5691 444ను అందుబాటులోకి తెచ్చింది. ఖుష్బూ జీవితం ప్రారంభమవ్వకముందే ముగిసినట్లు తెలుస్తోంది. ప్రేమ, ఆశ, కలలు అన్నీ క్షణాల్లోనే మంటల్లో కలిసిపోయాయి. పెళ్లి కూతురు చేతుల్లో మల్లెపూలు ఉండాల్సిన రోజున, మృత్యువే ఆమెను ఆలింగనం చేసుకుందని సమాచారం. ఈ విధి వింతలు చూస్తుంటే, మనిషి ఆశలన్నీ ఎంత బలహీనమో, జీవితం ఎంత అస్థిరమో అనిపిస్తుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
వణికించిన టాప్ 10 విమాన ప్రమాదాలు..
ఎయిర్ ఇండియా ప్రమాదం ఫస్ట్ వీడియో
For National News And Telugu News