Share News

Heavy Birth Weight: నవజాత శిశువు బరువు 5.2 కిలోలు

ABN , Publish Date - Sep 06 , 2025 | 04:28 AM

అప్పుడే పుట్టిన శిశువు ఎంత బరువు ఉంటాడు? రెండున్నర.. మహా అయితే మూడున్నర కిలోలు! మధ్యప్రదేశ్‌..

Heavy Birth Weight: నవజాత శిశువు బరువు 5.2 కిలోలు

  • మధ్యప్రదేశ్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో బాలభీముడు

  • ఈస్థాయి బరువుతో జననం అరుదు అంటున్న వైద్యులు

జబల్‌పూర్‌, సెప్టెంబరు5: అప్పుడే పుట్టిన శిశువు ఎంత బరువు ఉంటాడు? రెండున్నర.. మహా అయితే మూడున్నర కిలోలు! మధ్యప్రదేశ్‌ జబల్‌పూర్‌ జిల్లాలోని ప్రభుత్పాస్పత్రిలో బుధవారం బాల భీముడిని తలపించేలా పుట్టిన మగ శిశువును చూసి వైద్యులే ఆశ్చర్యపోయారు. తూస్తే ఆ బిడ్డ 5.2 కిలోలున్నాడు. తల్లి శుభాంగి, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. ఇంత బరువుతో బిడ్డ పుట్టడం అరుదైన విషయమని సిజేరియన్‌ చేసిన గైనకాలజిస్టు డాక్టర్‌ భావనా మిశ్రా చెప్పారు. అప్పుడే పుట్టిన బిడ్డల్లో మగ శిశువులైతే సగటున 2.8-3.2 కిలోలు, ఆడ శిశువులైతే 2.7-3.1 కిలోల వరకు బరువు ఉంటారని ఆమె పేర్కొన్నారు. ఈస్థాయి బరువుతో పుట్టిన బిడ్డను తాను చూడలేదన్నారు.


ఇవి కూడా చదవండి

భారత్‌లో తొలి టెస్లా కారు డెలివరీ.. కస్టమర్ ఎవరంటే..

భారత్‌ను ముక్కలు చేయాలంటూ పోస్టు.. ఆస్ట్రియా ఆర్థికవేత్త ఎక్స్ అకౌంట్‌పై నిషేధం

For More National News and Telugu News

Updated Date - Sep 06 , 2025 | 04:29 AM