Share News

New rules from October: అక్టోబర్ 1 నుంచి మారేవి ఇవే.. ఈ విషయాలు తెలుసుకోండి..

ABN , Publish Date - Oct 01 , 2025 | 09:30 AM

మరో కొత్త నెల ప్రారంభమైంది. ప్రతి నెల కొన్ని నిబంధనలు మారుతుంటాయి. ఈ రోజు నుంచి కొన్ని కొత్త నిబంధనలు అమల్లోకి రాబోతున్నాయి. ఈ మార్పులు మీ దైనందిన జీవితాన్ని నేరుగా ప్రభావితం చేయనున్నాయి.

New rules from October: అక్టోబర్ 1 నుంచి మారేవి ఇవే.. ఈ విషయాలు తెలుసుకోండి..
New rules from October

మరో కొత్త నెల ప్రారంభమైంది. అక్టోబర్ వచ్చేసింది. ప్రతి నెల కొన్ని నిబంధనలు మారుతుంటాయి. ఈ రోజు నుంచి కొన్ని కొత్త నిబంధనలు అమల్లోకి రాబోతున్నాయి. ఈ మార్పులు మీ దైనందిన జీవితాన్ని నేరుగా ప్రభావితం చేయనున్నాయి. ఆ కొత్త నిబంధనల గురించి కాస్త తెలుసుకుందాం (New rules from October).


1)గ్యాస్ సిలిండర్ ధరలు (Gas Cylinder Prices):

ప్రతి నెల చమురు కంపెనీలు గ్యాస్ సిలిండర్ల ధరలను సవరిస్తుంటాయి. ఇంట్లో వాడుకునే సిలిండర్ ధరలు చాలా కాలం నుంచి స్థిరంగానే ఉన్నాయి. ఈ నెలలో కూడా వాటి ధరల విషయంలో మార్పు లేదు. అయితే 19 కిలోల వాణిజ్య సిలిండర్‌లపై మాత్రం చమురు కంపెనీలు రూ.15 పెంచాయి.

2) రైల్వే టిక్కెట్ బుకింగ్ (IRCTC Aadhaar rule):

ఆన్‌లైన్ రిజర్వేషన్లు ప్రారంభమైన మొదటి 15 నిమిషాల్లో పూర్తి ఆధార్ ధృవీకరణ ఉన్నవారు మాత్రమే టిక్కెట్లను బుక్ చేసుకోగలరు. ఇప్పటివరకు ఈ నియమం తత్కాల్ టిక్కెట్లకు మాత్రమే వర్తించేది.

3) యూపీఐ అభ్యర్థనలు (UPI Rules):

ఇక నుంచి యూపీఐ యాప్ ద్వారా నేరుగా డబ్బులను అభ్యర్థించడం కుదరదు. మోసాన్ని నివారించడానికి ఈ కొత్త నిబంధనను తీసుకొచ్చారు.


4)యూపీఐ చెల్లింపు పరిమితి (UPI Limit):

నేటి నుంచి యూపీఐను ఉపయోగించి ఒకేసారి రూ.5 లక్షల వరకు పంపవచ్చు. గతంలో ఈ పరిమితి 1 లక్ష రూపాయలు మాత్రమే.

5)పెన్షన్ స్కీమ్ (NPS):

జాతీయ పెన్షన్ వ్యవస్థ కనీస నెలసరి డిపాజిట్ నేటి నుంచి రూ. 1,000గా ఉండనుంది. ఇప్పటివరకు రూ. 500 గా ఉండేది.

6)ఆన్‌లైన్ గేమింగ్‌ (Online Gaming Act):

నేటి నుంచి అన్ని ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలు ప్రభుత్వ లైసెన్స్ పొందడం తప్పనిసరి. రియల్ మనీ గేమింగ్‌లో పాల్గొనడానికి కనీసం 18 సంవత్సరాల వయసు నిండి ఉండాలి.


ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

రూ.485కే 72 రోజుల ప్లాన్..అన్‌లిమిటెడ్ కాలింగ్, 2 జీబీ డేటా

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 01 , 2025 | 09:30 AM