Share News

Voter List Revision: దేశవ్యాప్తంగా ఓటరు జాబితాల ప్రక్షాళన

ABN , Publish Date - Sep 22 , 2025 | 06:39 AM

దేశవ్యాప్తంగా సమగ్ర ఓటర్ల సవరణ(ఎ్‌సఐఆర్‌) చేపట్టేందుకు ఎన్నికల కమిషన్‌(ఈసీ) సమాయత్తమవుతోంది. అక్టోబరులో అన్ని రాష్ట్రాల్లోని ఓటర్ల జాబితాల ప్రక్షాళన చేపట్టే అవకాశముందని...

Voter List Revision: దేశవ్యాప్తంగా ఓటరు జాబితాల ప్రక్షాళన

  • సన్నద్ధతకు ఈ నెల 30వ తేదీ డెడ్‌లైన్‌

  • రాష్ట్రాల సీఈవోలకు ఎన్నికల సంఘం ఆదేశాలు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 21: దేశవ్యాప్తంగా సమగ్ర ఓటర్ల సవరణ(ఎ్‌సఐఆర్‌) చేపట్టేందుకు ఎన్నికల కమిషన్‌(ఈసీ) సమాయత్తమవుతోంది. అక్టోబరులో అన్ని రాష్ట్రాల్లోని ఓటర్ల జాబితాల ప్రక్షాళన చేపట్టే అవకాశముందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ నెల (సెప్టెంబరు) 30 నాటికి ఇందుకోసం సిద్ధం కావాలని అన్ని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారు(సీఈవో)లను ఈసీ ఆదేశించింది. ఇటీవల ఢిల్లీలో సీఈవోలు, ఎన్నికల సంఘం అధికారులతో ఈసీ ఒక సమావేశం నిర్వహించింది. దేశవ్యాప్తంగా ఎస్‌ఐఆర్‌ చేపట్టడంపై ఆ సమావేశంలోనే అధికారులకు మార్గనిర్దేశనం చేసినట్లు సమాచారం. చివరిసారి ఎస్‌ఐఆర్‌ చేపట్టిన ఓటరు జాబితాలను సిద్ధం చేసుకోవాలని, ఈ ప్రక్రియను రాబోయే పది పదిహేను రోజుల్లో పూర్తి చేసుకుని సిద్ధంగా ఉండాలని అన్ని రాష్ట్రాల సీఈవోలను ఈసీ ఆ సమావేశంలోనే ఆదేశించింది. కాగా, చాలా రాష్ట్రాలు ఇప్పటికే ఓటరు జాబితాలను వెబ్‌సైట్లలో అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఢిల్లీ 2008లో, ఉత్తరాఖండ్‌ 2006లో చివరిసారి ఎస్‌ఐఆర్‌ను నిర్వహించాయి. దేశంలోని చాలా రాష్ట్రాల్లో 2002-2004 మధ్య ఎస్‌ఐఆర్‌ చేపట్టిన ఓటరు జాబితాలే అందుబాటులో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి..

జీఎస్టీ సంస్కరణలతో ఆత్మనిర్భరత... శరవేగంగా వృద్ధి

దేశ ప్రజలకు ప్రధాని గుడ్ న్యూస్.. ఇక జీఎస్టీ ఉత్సవ్‌ ప్రారంభం

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 22 , 2025 | 06:39 AM