National Eye Care: కంటి సంరక్షణకు హెల్ప్ లైన్
ABN , Publish Date - Sep 15 , 2025 | 06:34 AM
సరైన సమయంలో సరైన కంటి వైద్యుడిని సంప్రదించకపోవడం వల్ల దేశంలో అనేక మంది కంటిచూపు కోల్పోతున్నారు. అయితే ఈ పరిస్థితిని అధిగమించి.. దేశ పౌరులందరికీ కంటి సంరక్షణ అందించే...
99906 66872 కు కాల్ చేస్తే దేశవ్యాప్తంగా ఉచిత సలహాలు, సూచనలు
కంటి సంరక్షణకు జాతీయ ‘హెల్ప్’లైన్
న్యూఢిల్లీ, సెప్టెంబరు 14: సరైన సమయంలో సరైన కంటి వైద్యుడిని సంప్రదించకపోవడం వల్ల దేశంలో అనేక మంది కంటిచూపు కోల్పోతున్నారు. అయితే ఈ పరిస్థితిని అధిగమించి.. దేశ పౌరులందరికీ కంటి సంరక్షణ అందించే దిశగా కీలక ముందడుగు పడింది. కంటి సమస్యలతో బాధపడుతున్న వారిని వైద్యులతో అనుసంధానించడానికి ఢిల్లీలోని ప్రముఖ నేత్ర వైద్యుల బృందం జాతీయ హెల్ప్‌లైన్ నంబర్ 9990666872ను ప్రారంభించింది. లాభాపేక్షలేని సంస్థ ‘సైట్ సార్తి ఇండియా ఫౌండేషన్’ ఆధ్వర్యంలో ప్రారంభించిన ఈ హెల్ప్‌లైన్ నంబర్ ద్వారా.. దేశవ్యాప్తంగా కంటి సమస్యలతో పోరాడుతున్న ఎవరికైనా టెలిఫోన్, వీడియో కాలింగ్ ద్వారా కంటి వైద్య నిపుణులు చికిత్సకు సంబంధించిన సలహాలు, సూచనలు ఉచితంగా అందిస్తారు. ఢిల్లీలోని ప్రముఖ కంటి వైద్య నిపుణుడు డాక్టర్ ఇకేడాలాల్ నేతృత్వంలో పనిచేసే ఈ హెల్ప్‌లైన్ నంబర్‌కు.. దేశంలోని అన్ని ప్రాంతాల వారు ఫోన్‌చేసి తమ సమస్యలు తెలియజేవచ్చు
ఇవి కూడా చదవండి..
అస్సాంలో 5.8 తీవ్రతతో భూకంపం.. బెంగాల్‌లోనూ ప్రకంపనలు
నేను శివ భక్తుడిని, నేను విషం అంతా మింగేస్తాను
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి