Share News

Nainar Nagendran: తమిళనాడు బీజేపీ కొత్త అధ్యక్షుడుగా నైనార్ నాగేంద్రన్

ABN , Publish Date - Apr 11 , 2025 | 03:49 PM

ప్రస్తుతం రాష్ట్ర బీజేపీ చీఫ్‌గా ఉన్న అన్నామలై స్థానంలో నాగేంద్రన్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ పదవికి నాగేంద్రన్ ఒక్కరే శుక్రవారంనాడు నామినేషన్ వేశారు.

Nainar Nagendran: తమిళనాడు బీజేపీ కొత్త అధ్యక్షుడుగా నైనార్ నాగేంద్రన్

చెన్నై: తమిళనాడు బీజేపీ కొత్త అధ్యక్షుడుగా తిరునల్వేలి శాసనసభ్యుడు నైనార్ నాగేంద్రన్ (Nainar Nagendran) పగ్గాలు చేపట్టనున్నారు. ప్రస్తుతం రాష్ట్ర బీజేపీ చీఫ్‌గా ఉన్న అన్నామలై స్థానంలో నాగేంద్రన్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ పదవికి నాగేంద్రన్ ఒక్కరే శుక్రవారంనాడు నామినేషన్ వేశారు. దీంతో ఆయన నియామకం ఖాయమైంది.

Himanta Biswa Sarma: ముంబై ఉగ్రదాడి నుంచి తృటిలో తప్పించుకున్నా: అసోం సీఎం


నాగేంద్రన్ పేరును అన్నామలై ప్రతిపాదించగా, పార్టీ ఇతర నేతలు బలపరిచారు. కాగా, నాగేంద్రన్ నియామకానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో శనివారంనాడు ప్రకటించనున్నారు.


నాగేంద్రన్ ఎవరంటే..

నైనార్ నాగేంద్రన్ ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా ఉన్నారు. తొలుత ఆయన అన్నాడీఎంకేలో పనిచేశారు. ప్రస్తుతం ఆయన తిరునల్వేలి నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. టీనగర్‌లోని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఆయన శుక్రవారంనాడు నామినేషన్ వేశారు. ఆయన పేరును బీజేపీ ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు కె.అన్నామలై, కేంద్ర మంత్రి ఎల్.మురుగన్, కేంద్ర మాజీ మంత్రి పొన్ రాథాకృష్ణన్, పార్టీ ఎమ్మెల్యే, మహిళా మోర్చా ప్రెసిడెంట్ వనతి శ్రీనివాసన్ ప్రతిపాదించారు.పార్టీ అధ్యక్షుడి రేసులో తాను లేనని అన్నామలై ఇప్పటికే ప్రకటించారు.


ఇవి కూడా చదవండి..

Tahawwur Rana-Modi: తహవూర్ రాణా అప్పగింత.. మోదీ పాత ట్వీట్ వైరల్

Custody: తహవ్వుర్‌ రాణాకు 18 రోజుల ఎన్ఐఏ కస్టడీ

Updated Date - Apr 11 , 2025 | 03:58 PM