Share News

Nagarjuna family with Narendra Modi: నరేంద్ర మోదీతో అక్కినేని నాగార్జున ఫ్యామిలీ భేటీ..

ABN , Publish Date - Feb 07 , 2025 | 12:45 PM

ప్రధాని నరేంద్ర మోదీతో టాలీవుడ్ హీరో అక్కినేని నాగర్జున ఫ్యామిలీ భేటీ అయింది. కుటుంబ సమేతంగా ప్రధాని మోదీని కలిసేందుకు అక్కినేని నాగార్జున, అమల, చైతన్య, శోభిత ధూళిపాళ్ల పార్లమెంటుకు వెళ్లారు. కాగా..

 Nagarjuna family with Narendra Modi: నరేంద్ర మోదీతో అక్కినేని నాగార్జున ఫ్యామిలీ భేటీ..
Nagarjuna And Modi

ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీతో టాలీవుడ్ హీరో అక్కినేని నాగర్జున ఫ్యామిలీ భేటీ అయింది. కుటుంబ సమేతంగా ప్రధాని మోడీని కలిసేందుకు అక్కినేని నాగార్జున, అమల, చైతన్య, శోభిత ధూళిపాళ్ల పార్లమెంటుకు వెళ్లారు. కాగా, హీరో నాగార్జున గతంలో పలుమార్లు ప్రధాని మోదీని కలిశారు. ఇటీవల టాలీవుడ్ దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావుపై నరేంద్ర మోదీ ప్రశంసలు కూడా కురిపించారు. భారతీయ సినిమాకు నాగేశ్వరరావు చేసిన కృషిని 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర కొనియాడారు. మోదీ చేసిన వ్యాఖ్యలకు హీరో నాగార్జున సోషల్ మీడియా వేదికగా స్పందించి ధన్యవాదాలు తెలిపారు.


ఇదిలా ఉంటే.. అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన చిత్రం 'తండేల్' నేడు విడుదల అయింది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. హీరో నాగ చైతన్యను ఇప్పటి వరకు లవర్ బాయ్‌గానే చూసిన అక్కినేని అభిమానులకు తనలోని మరో యాంగిల్‌ను చూపించారు నాగ చైతన్య . పాకిస్థాన్‌లో దొరికిపోయిన జాలరిగా విభిన్న పాత్రల్లో నాగ చైతన్య నటించి అందరిని మెప్పించారు. చందు మొండేటి దర్శకత్వం వహించిన 'తండేల్' సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటించింది.

Updated Date - Feb 07 , 2025 | 01:00 PM