Bengaluru: ఐదు పదుల వయసులో ప్రేమ..
ABN , Publish Date - Oct 16 , 2025 | 01:12 PM
ప్రముఖ సంగీత దర్శకుడు రఘుదీక్షిత్‌కు ఐదు పదులలో మరోసారి ప్రేమ చిగురించింది. ఈనెలాఖరున ప్రముఖ గాయని వారిజాశ్రీ వేణుగోపాల్‌తో వివాహం కానుంది. బహుభాషా జానపద సంగీత ప్రముఖుడిగా రఘుదీక్షిత్‌కు పేరుంది.
- త్వరలోనే సంగీత దర్శకుడు రఘుదీక్షిత్ వివాహం
బెంగళూరు: ప్రముఖ సంగీత దర్శకుడు రఘుదీక్షిత్(Raghudeekshith)కు ఐదు పదులలో మరోసారి ప్రేమ చిగురించింది. ఈనెలాఖరున ప్రముఖ గాయని వారిజాశ్రీ వేణుగోపాల్‌తో వివాహం కానుంది. బహుభాషా జానపద సంగీత ప్రముఖుడిగా రఘుదీక్షిత్‌కు పేరుంది. గ్రామీ నామినేటెడ్ సంగీత కళాకారిణి, వేణువాదకురాలు వారిజశ్రీ వేణుగోపాల్‌తో ఇటీవల ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది. ఇదే విషయమై రఘుదీక్షిత్ మీడియాతో మాట్లాడుతూ నా జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతోందన్నారు.

నేను అనుకోలేదని, ఇదంతా ఆకస్మికంగా జరిగిందన్నారు. కొత్త జీవితంలో కొత్త అధ్యాయంలో కలసి జీవించాలని అనుకుంటున్నామన్నారు. ప్రముఖ నృత్య కళాకారిణి మయూరి ఉపాధ్యాయను రఘుదీక్షిత్ వివాహం చేసుకున్న తర్వాత కొన్నేళ్లకు భిన్నాభిప్రాయాలు ఏర్పడంతో విడాకులు తీసుకున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..
మంత్రి కొండా సురేఖ ఇంటి ముందు హైడ్రామా
వచ్చే ఐదేళ్లలో రూ 45000 కోట్ల పెట్టుబడులు
Read Latest Telangana News and National News