Mumbai on High Alert: మానవబాంబుల బెదిరింపు..ముంబైలో హైఅలెర్ట్
ABN , Publish Date - Sep 06 , 2025 | 04:33 AM
వినాయక నిమజ్జన ఉత్సవానికి ముంబై నగరం సిద్ధమవుతున్న వేళ మానవబాంబుల బెదిరింపు తీవ్ర..
లష్కరే పేరిట ట్రాఫిక్ పోలీసు హెల్ప్‌లైన్‌కు మెసేజ్
ముంబై, సెప్టెంబరు 5: వినాయక నిమజ్జన ఉత్సవానికి ముంబై నగరం సిద్ధమవుతున్న వేళ మానవబాంబుల బెదిరింపు తీవ్ర కలకలం రేపింది. ముంబైలోకి ప్రవేశించిన 14 మంది ఉగ్రవాదులు 400 కిలోల ఆర్డీఎక్స్‌ను వేర్వేరు వాహనాల్లో పెట్టి పేలుళ్లకు సిద్ధంగా ఉన్నారని పేర్కొంటూ పోలీసులకు వచ్చిన సందేశంతో ముంబైలో హైఅలెర్ట్ ప్రకటించారు. ముంబైలో శనివారం నిమజ్జన ఉత్సవం జరగనుండగా ముంబై ట్రాఫిక్ పోలీసు వాట్సాప్ హెల్ప్‌లైన్ నెంబరుకు గురువారం ఈ బెదిరింపు సందేశం వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. బెదిరింపు సందేశం పంపిన వ్యక్తి తనని తాను లష్కేరే తాయిబాకు చెందిన వ్యక్తిగా పేర్కొన్నాడు. తమ వాళ్లు 14 మంది ముంబైలో అడుగుపెట్టారని 34 వాహనాల్లో 400 కిలోల ఆర్డీఎక్స్‌ను అమర్చారని, ముంబైలో జరిగే ఈ పేలుళ్లతో భారతదేశాన్నే వణికిస్తామని ఆ సందేశంలో హెచ్చరించాడు. ఈ బెదిరింపు సందేశంతో అప్రమత్తమైన పోలీసు వర్గాలు నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశాయి. కీలకమైన, సున్నితమైన ప్రదేశాల్లో భద్రతను పెంచడమే కాక సోదాలు చేస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
భారత్‌లో తొలి టెస్లా కారు డెలివరీ.. కస్టమర్ ఎవరంటే..
భారత్‌ను ముక్కలు చేయాలంటూ పోస్టు.. ఆస్ట్రియా ఆర్థికవేత్త ఎక్స్ అకౌంట్‌పై నిషేధం
For More National News and Telugu News