MP R Krishnaiah: హిందీ సలహా కమిటీలో ఆర్.కృష్ణయ్య
ABN , Publish Date - Sep 03 , 2025 | 02:59 AM
కేంద్ర సామాజిక న్యాయం, సశక్తీకరణ మంత్రిత్వ శాఖ పరిధిలోని హిందీ సలహా కమిటీని పునర్‌వ్యవస్థీకరించారు....
న్యూఢిల్లీ, సెప్టెంబరు 2: కేంద్ర సామాజిక న్యాయం, సశక్తీకరణ మంత్రిత్వ శాఖ పరిధిలోని హిందీ సలహా కమిటీని పునర్‌వ్యవస్థీకరించారు. ఇందులో ఎంపీ ఆర్.కృష్ణయ్యను చేరుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈయనతో పాటు ఎంపీలు సురేశ్ కుమార్ కశ్యప్, సంధ్య రాయ్, ధైర్యశీల్ మోహన్ పాటిల్ కూడా కమిటీకి నామినేట్ అయ్యారు. సామాజిక న్యాయశాఖ మంత్రి వీరేంద్ర దీనికి చైర్‌పర్సన్. సహాయ మంత్రులు బి.ఎల్. వర్మ, రామ్‌దాస్ అథవాలే డిప్యూటీ చైర్‌పర్సన్, సభ్యులుగా ఉంటారు. ఇందులో ఎంపీలు, హిందీ భాషా నిపుణులు సభ్యులుగా ఉంటారు. అధికార భాషగా హిందీ వినియోగం పెంచడం ఈ కమిటీ లక్ష్యం.
ఈ వార్తలు కూడా చదవండి..
మణిపూర్‌లో పర్యటించనున్న ప్రధాని మోదీ..!
ఏపీ మహేష్ బ్యాంక్‌కు షాక్ ఇచ్చిన ఈడీ
For More National News And Telugu News