Share News

Justice Varma Impeachment: అందిన అభిశంసన తీర్మానాలు!

ABN , Publish Date - Jul 22 , 2025 | 04:59 AM

వివాదాస్పద హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వర్మను పదవి నుంచి తొలగించడానికి ఉద్దేశించిన..

Justice Varma Impeachment: అందిన అభిశంసన తీర్మానాలు!
Justice Varma Impeachment

  • జస్టిస్‌ వర్మను తొలగించాలని 204 మంది సంతకాలు

  • లోక్‌సభలో 152 మంది, రాజ్యసభలో 52 మంది

  • అభిశంసన ప్రక్రియను ప్రారంభించిన రాజ్యసభ

న్యూఢిల్లీ, జూలై 21: వివాదాస్పద హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వర్మను పదవి నుంచి తొలగించడానికి ఉద్దేశించిన అభిశంసన ప్రక్రియ మొదలైంది. ఆయన్ను పదవి నుంచి తొలగించే తీర్మానాన్ని చేపట్టాలని కోరుతూ 152 మంది ఎంపీలు సంతకాలు చేసిన వినతి పత్రాన్ని సోమవారం లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు సమర్పించారు. ఈ తీర్మానానికి పార్టీలకు అతీతంగా పార్లమెంటు సభ్యుల నుంచి మద్దతు లభించింది. దానిపై సంతకం చేసిన వారిలో బీజేపీ, కాంగ్రెస్‌, టీడీపీ, జేడీయూ, సీపీఎం ఇతర పార్టీల సభ్యులున్నారు. లోక్‌సభలో వంద, రాజ్యసభలో 50 మంది సభ్యులు కోరుకుంటే సుప్రీంకోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తి మీద అభిశంసన ప్రక్రియ మొదలు పెట్టొచ్చు. లోక్‌సభ స్పీకర్‌ లేదా రాజ్యసభ చైర్మన్‌లలో ఎవరైనా అభిశంసన ప్రక్రియను ముందుకు తీసుకు వెళ్లాలి. ఈసారి రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఆ బాధ్యతను తీసుకున్నారు. అభిశంసనకు అవసరమైన చర్యలు తీసుకొమ్మని రాజ్యసభ సెక్రెటరీ జనరల్‌ను ఆదేశించారు. ఇదిలా ఉండగా, తానేమీ తప్పు చేయలేదని జస్టిస్‌ వర్మ అంటున్నారు. సుప్రీంకోర్టు కమిటీ అభిశంసన సిఫార్సును సవాలు చేస్తూ ఇప్పటికే ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఈ వార్తలు కూడా చదవండి..

ఆర్టీఐలో సామాజిక న్యాయం ఎక్కడ? ప్రభుత్వానికి ఎమ్మెల్సీ కవిత సూటి ప్రశ్న..

రేవంత్‌ నాటుకోడి.. కేటీఆర్‌ బాయిలర్‌ కోడి

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 22 , 2025 | 04:59 AM