Share News

ఇదేం బుద్ధి తల్లి.. అన్న వరుసయ్యే వ్యక్తితో మహిళ జంప్

ABN , Publish Date - Apr 19 , 2025 | 08:27 AM

సునీల్ కుమార్ లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. డ్యూటీకి వెళితే.. రెండు నెలలు ఇంటికి వచ్చే వాడే కాదు. ఇంటి ఖర్చుల కోసం డబ్బు పంపేవాడు. ఈ నేపథ్యంలోనే కూతురి మామ శైలేంద్రతో మమతకు సంబంధం ఏర్పడింది. ఇద్దరూ ఫోన్‌లో తరచుగా మాట్లాడుకునే వారు. తరచుగా ఏకాంతంగా కలిసేవారు.

ఇదేం బుద్ధి తల్లి.. అన్న వరుసయ్యే వ్యక్తితో మహిళ జంప్
UP News

కూతురి మామ( కూతురి భర్త తండ్రి)తో ఓ మహిళ సంబంధం పెట్టుకుంది. భర్తను, కుటుంబాన్ని కాదని అతడితో పారిపోయింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబసభ్యులు చెప్పిన వివరాల మేరకు.. ఉత్తర ప్రదేశ్‌లోని బదౌన్‌కు చెందిన సునీల్ కుమార్, మమతా భార్యాభర్తలు. వీరికి 2002లో పెళ్లయింది. వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు. 2022లో వీరి పిల్లల్లో ఒకమ్మాయికి పెళ్లయింది. ఇక, సునీల్ కుమార్ లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. డ్యూటీకి వెళితే.. రెండు నెలలు ఇంటికి వచ్చే వాడే కాదు. ఇంటి ఖర్చుల కోసం డబ్బు పంపేవాడు. ఈ నేపథ్యంలోనే కూతురి మామ శైలేంద్రతో మమతకు సంబంధం ఏర్పడింది.


ప్రతీ మూడు రోజులకు ఒకసారి శైలేంద్ర మమత ఇంటికి వచ్చే వాడు. ఆ టైంలో మమత తన పిల్లల్ని వేరే రూముకు పంపేది. శైలేంద్ర తెల్లవారే వరకు ఇంట్లోనే ఉండే వాడు. తర్వాత వెళ్లిపోయేవాడు. పొరిగిళ్లలో ఉండే వారు అతడ్ని చూసేవారు. శైలేంద్ర .. మమతకు బంధువు అవ్వటం.. అది కూడా అన్న వరుస అవ్వటంతో పెద్దగా పట్టించుకోలేదు. అయితే, ఎలా తెలిసిందో ఈ విషయం భర్తకు తెలిసింది. ఆమెను మందిలించాడు. దీంతో మమత, శైలేంద్ర ఇంట్లోనుంచి పారిపోయారు. విషయం తెలిసి రెండు కుటుంబాల వారు షాక్ అయ్యారు. సునీల్ కుమార్ ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


కాబోయే అల్లుడితో అత్త జంప్

ఉత్తర ప్రదేశ్, అలీఘర్‌కు చెందిన స్వప్న అనే మహిళ కూతురికి కాబోయే భర్తతో ఇంటినుంచి పారిపోయింది. పెళ్లికి పది రోజుల ముందు కాబోయే అల్లుడు రాహుల్‌తో వెళ్లిపోయింది. పోలీసులు వారి కోసం వెతుకుతున్నారని తెలియటంతో.. ఊరికి వచ్చేశారు. పోలీసుల దగ్గరకు వెళ్లారు. ఎందుకు లేచిపోవాల్సి వచ్చిందో వారికి వివరించి చెప్పారు. త్వరలో ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపారు. అయితే, స్వప్న కుటుంబం సభ్యులు ఆమెను ఎట్టి పరిస్థితుల్లో ఇంటికి తిరిగి రానిచ్చేది లేదని తేల్చి చెప్పారు.


ఇవి కూడా చదవండి

Lady Don: లేడీ డాన్ కళ్లముందే హత్య.. ఆమె బుద్ధే మంచిది కాదు..

Gold Rates: రోజు రోజుకు పెరుగుతున్న బంగారం ధరలు

Updated Date - Apr 19 , 2025 | 11:46 AM