Share News

Lady Don: లేడీ డాన్ కళ్లముందే హత్య.. ఆమె బుద్ధే మంచిది కాదు..

ABN , Publish Date - Apr 19 , 2025 | 07:52 AM

Lady Don: డ్రగ్స్ కేసులో హసీమ్ బాబా జైలు పాలైన తర్వాత జిక్రా రెచ్చిపోయింది. సొంతంగా ఓ గ్యాంగును తయారు చేసుకుంది. బుధవారం రోజు కునాల్‌ను మర్డర్ చేస్తానంటూ వార్నింగ్ కూడా ఇచ్చింది.

Lady Don: లేడీ డాన్ కళ్లముందే హత్య.. ఆమె బుద్ధే మంచిది కాదు..
Lady Don

రాను రాను ఆడవాళ్లలో కూడా నేర ప్రవృత్తి బాగా పెరిగిపోతోంది. ముఖ్యంగా ఉత్తర భారత దేశంలో మహిళలు అధికంగా నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా, ఢిల్లీ మైనర్ బాలుడి మర్డర్ కేసులో ఓ లేడీ డాన్ పేరు బలంగా వినిపించింది. మీడియాలో సైతం వార్తలు వచ్చాయి. ఆ వార్తలే నిజం అయ్యాయి. శుక్రవారం పోలీసులు ఆ లేడీ డాన్‌ను అరెస్ట్ చేశారు. దగ్గరుండి మరీ ఆమే బాలుడ్ని హత్య చేయించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇంతకీ ఆ లేడీ డాన్ మైనర్ బాలుడ్ని ఎందుకు చంపించింది?.. ఢిల్లీకి చెందిన డాన్ హషీమ్ బాబాకు.. ఈ లేడీ డాన్‌కు ఉన్న సంబంధం ఏంటి?..


బౌన్సర్ నుంచి లేడీ డాన్‌గా..

ఢిల్లీలో నివాసం ఉంటున్న జిక్రా.. లోకల్ గ్యాంగ్‌స్టర్ హషీమ్ బాబా భార్య జోయ దగ్గర బౌన్సర్‌గా పని చేసేది. జిక్రాది మొదటి నుంచి నేర ప్రవృత్తి కలిగిన మనస్తత్వమే. ఆమెకు అండర్ వరల్డ్‌తో కూడా సంబంధాలు ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది. ఇక, సోషల్ మీడియాలో సైతం జిక్రా హల్‌చల్ చేస్తూ ఉంటుంది. తనను తాను లేడీ డాన్‌గా ప్రకటించుకుంది. గన్నులతో వీడియోలు చేస్తూ ఉండేది. ఈ నేపథ్యంలోనే ఓసారి జైలుకు కూడా వెళ్లి వచ్చింది. అయినా ఆమెలో మార్పు రాలేదు. హసీమ్ బాబా చేసిన చాలా అక్రమ పనుల్లో జిక్రాకు కూడా సంబంధం ఉన్నట్లు సమాచారం.


డ్రగ్స్ కేసులో హసీమ్ బాబా జైలు పాలైన తర్వాత జిక్రా రెచ్చిపోయింది. సొంతంగా ఓ గ్యాంగును తయారు చేసుకుంది. ఆ గ్యాంగులో 10 నుంచి 12 మంది యువకులు ఉన్నారు. జోయాను అడ్డం పెట్టుకుని హషీమ్ బాబాకు మరింత దగ్గర కావాలని చూసింది. డ్రగ్స్ దందాలో అతడితో పాటు భాగం కావాలని అనుకుంది. అయితే, ఆమె ప్లాన్ వర్కవుట్ అవ్వలేదు. హషీమ్ బాబాతో పాటు జోయా కూడా డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయింది. ఇప్పుడు జిక్రా గ్యాంగు వాడుతున్న అన్ని గన్నుల్ని కూడా జోయానే సప్లై చేసింది.


మైనర్ బాలుడిపై రివేంజ్..

ఢిల్లీకి చెందిన కునాల్ సింగ్ అనే 17 ఏళ్ల బాలుడికి జిక్రా సోదరుడు సాహిల్‌తో గొడవ జరిగింది. కునాల్ గ్యాంగ్ .. సాహిల్‌పై దాడి చేసింది. ఈ నేపథ్యంలోనే కునాల్‌, అతడి గ్యాంగుపై మర్డర్ కేసు నమోదైంది. తన సోదరుడిపై కునాల్ దాడి చేయటంతో జిక్రాకు కోపం వచ్చింది. ఎలాగైనా అతడిపై పగ తీర్చుకోవాలని భావించింది. బుధవారం రోజు కునాల్‌ను మర్డర్ చేస్తానంటూ వార్నింగ్ కూడా ఇచ్చింది. హత్యకు కొన్ని రోజుల ముందు నుంచే జిక్రా గ్యాంగ్ కునాల్ ఇంటి దగ్గర రెక్కీ నిర్వహించింది. గురువారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో కునాల్ పాల ప్యాకెట్ కోసం బయటకు వెళ్లాడు. అప్పుడు అతడ్ని చంపేశారు. ఈ కేసులో ఆమె హస్తం ఉందని తేలటంతో.. శుక్రవారం ఆమెను అరెస్ట్ చేశారు. జిక్రా దగ్గరుండి మరీ కునాల్‌ను హత్య చేయించినట్లు పోలీసుల విచారణలో తేలింది.


ఇవి కూడా చదవండి

Gold Rates: రోజు రోజుకు పెరుగుతున్న బంగారం ధరలు

KTR: గ్రేటర్‌ నేతలతో నేడు కేటీఆర్‌ సమావేశం

Updated Date - Apr 19 , 2025 | 07:52 AM