Gold Rates: రోజు రోజుకు పెరుగుతున్న బంగారం ధరలు
ABN , Publish Date - Apr 19 , 2025 | 06:50 AM
Today Gold And Silver Rate In Telugu: వారం క్రితం తగ్గుతూ వచ్చిన బంగారం అందరిలో ఆసక్తి పెంచింది. ఇంకా కొంచెం తగ్గతే బంగారం కొనేద్దాం అని కొంతమంది అనుకున్నారు. అంతలోనే పెరగటం మొదలైంది. నిన్న హైదరాబాద్ నగరంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 97,580 దగ్గర ట్రేడ్ అయింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 89,450 దగ్గర ట్రేడ్ అయింది
భారతీయ సంస్కృతిలో బంగారం ఓ భాగం. ఏ శుభకార్యం జరిగినా బంగారం ఓ ప్రధాన పాత్ర పోషిస్తుంది. పెళ్లిళ్ల సమయంలో బంగారం స్థాయి ఏంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆడపిల్ల తల్లిదండ్రులకు బంగారం కొనడమే పెద్ద సవాలు. ‘అమ్మాయికి ఎంత బంగారం పెడుతున్నారు’ అని అందరూ అడుగుతారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగారం కొనడం అంటే.. ఆస్తుల్ని అమ్మకానికి పెట్టాల్సి వస్తోంది. ‘ ఒక్కసారి కమిట్ అయితే.. నా మాట నేనే వినను’ అన్నట్లు బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతూనే పోతున్నాయి. వారం క్రితం తగ్గుతూ వచ్చిన బంగారం అందరిలో ఆసక్తి పెంచింది. ఇంకా కొంచెం తగ్గితే బంగారం కొనేద్దాం అని కొంతమంది అనుకున్నారు. వాళ్ల ఆశల మీద నీళ్లు చల్లుతూ బంగారం మళ్లీ పెరగటం మొదలైంది. ఈ రోజు కూడా బంగారం స్వల్పంగా పెరిగింది.
నగరంలో బంగారం ధరలు ఇలా
నిన్న హైదరాబాద్ నగరంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 97,580 దగ్గర ట్రేడ్ అయింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 89,450 దగ్గర ట్రేడ్ అయింది..10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర .. 73,190 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది. నిన్నటితో పోల్చుకుంటే ఈ రోజు బంగారం ప్రతీ గ్రాముపై రూపాయి చొప్పున పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 97,590 దగ్గర ట్రేడ్ అవుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 89,460 దగ్గర ట్రేడ్ అవుతోంది..10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర .. 73,200 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది.
వెండి ధరలు ఇలా
గుడ్డిలో మెల్ల అన్నట్లు ఇన్ని రోజులు పెరుగుతూ పోయిన వెండి ధరలు నిన్న మాత్రం తగ్గాయి. ఒక గ్రాము వెండి ధర నిన్న 100 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది. 10 గ్రాముల వెండి 1000 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది. ఈ రోజు ఒక గ్రాము వెండిపై పది పైసలు తగ్గి.. 99.90 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది. 10 గ్రాము వెండి 999 దగ్గర ట్రేడ్ అవుతోంది. కేజీ వెండి ధర నిన్న లక్ష రూపాయల దగ్గర ట్రేడ్ అయింది. ఈ రోజు 99,900 దగ్గర ట్రేడ్ అవుతోంది. భవిష్యత్తులో వెండి మరింత పెరిగే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి
MK Stalin: ఎప్పటికీ ఢిల్లీకి తలొగ్గే ప్రసక్తి లేదు: స్టాలిన్
Amit Shah: ఇక మిలిగినవి నాలుగు జిల్లాలే.. నక్సల్ లొంగిపోవాలని అమిత్‌షా పిలుపు