Share News

Mother Neglect: 15 రోజుల బిడ్డను ఫ్రీజర్‌లో పెట్టి మర్చిపోయిన తల్లి

ABN , Publish Date - Sep 09 , 2025 | 03:28 AM

తన 15 రోజుల బిడ్డను ఓ తల్లి ఫ్రీజర్‌లో పెట్టి మర్చిపోయింది. ఆ శిశువు చలికి గుక్కపట్టి ఏడవడంతో కుటుంబ సభ్యులు గమనించి..

Mother Neglect: 15 రోజుల బిడ్డను ఫ్రీజర్‌లో పెట్టి మర్చిపోయిన తల్లి

మొరాదాబాద్‌, సెప్టెంబరు 8: తన 15 రోజుల బిడ్డను ఓ తల్లి ఫ్రీజర్‌లో పెట్టి మర్చిపోయింది. ఆ శిశువు చలికి గుక్కపట్టి ఏడవడంతో కుటుంబ సభ్యులు గమనించి ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శుక్రవారం రాత్రి బిడ్డను నిద్రపుచ్చిన తల్లి.. అలాగే ఆ శిశువును ఫ్రీజర్‌లో పెట్టి నిద్రపోయింది. అయితే కొద్ది నిమిషాలకే ఆ బిడ్డ చలికి తట్టుకోలేక బిగ్గరగా ఏడవడం ప్రారంభించాడు. దీంతో బిడ్డ కోసం ఇల్లంతా వెతికిన కుటుంబ సభ్యులు ఫ్రీజర్‌లో ఉన్నట్లు గుర్తించి బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. ఆ శిశువుకు చికిత్స అందించిన వైద్యులు.. ప్రాణాలకు ఏ ప్రమాదం లేదని తెలిపారు. అయితే సదరు మహిళ ప్రసవానంతర మానసిక సమస్యల (పోస్ట్‌పార్టమ్‌ సైకోసి్‌స)తో బాధపడుతున్నట్లు వైద్య పరీక్షల్లో తేలింది. దీంతో చికిత్స నిమిత్తం ఆమెను కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్చారు. కాగా, ప్రసవానంతరం హార్మోన్లలో మార్పులు, మానసిక ఒత్తిడి కారణంగా కొందరు మహిళలకు పోస్ట్‌పార్టమ్‌ సైకోసిస్‌ రావచ్చని.. దీంతో వారు తీసుకునే అసంబద్ధ నిర్ణయాలు బిడ్డకు హానీ చేయొచ్చని వైద్యులు చెబుతున్నారు. ముందే గుర్తించి చికిత్స అందిస్తే నయం చేయొచ్చంటున్నారు.


ఇవి కూడా చదవండి..

ఉప రాష్ట్రపతి ఎన్నికలో తొలి ఓటు వేసేది ఎవరంటే..

రేపే ఉపరాష్ట్రపతి ఎన్నిక

For More National News And Telugu News

Updated Date - Sep 09 , 2025 | 03:28 AM