Share News

Car Price Drop: మరిన్ని కంపెనీల కార్ల ధరలూ తగ్గాయ్‌..

ABN , Publish Date - Sep 09 , 2025 | 03:39 AM

ఆటోమొబైల్స్‌పై జీఎస్టీ రేటును ప్రభుత్వం తగ్గించిన నేపథ్యంలో ఆ మేరకు ప్రయోజనాన్ని కస్టమర్లకు అందించేందుకు..

Car Price Drop: మరిన్ని కంపెనీల కార్ల ధరలూ తగ్గాయ్‌..

  • ధరల తగ్గింపును ప్రకటించిన లెక్సస్‌, కియా, ఆడి, స్కోడా

న్యూఢిల్లీ, సెప్టెంబరు 8: ఆటోమొబైల్స్‌పై జీఎస్టీ రేటును ప్రభుత్వం తగ్గించిన నేపథ్యంలో ఆ మేరకు ప్రయోజనాన్ని కస్టమర్లకు అందించేందుకు మరికొన్ని కార్ల కంపెనీలు ధరలను తగ్గించాయి. ఇప్పటికే టాటా మోటార్స్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, రెనో, టయోటా, హ్యుండ య్‌ తమ కార్ల ధరలను తగ్గిస్తున్నట్టు ప్రకటించాయి. తాజాగా మరిన్ని కంపెనీలు ఈ జాబితాలో చేరాయి.

  • లగ్జరీ కార్ల కంపెనీ లెక్సస్‌ ఇండియా తన మొత్తం కార్ల శ్రేణి ధరలను రూ.20.8 లక్షల వరకు తగ్గిస్తున్నట్టు సోమవారం ప్రకటించింది. ధరలు ఈ నెల 22 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. తగ్గించిన ధరల శ్రేణి రూ.1.47లక్షల (సెడాన్‌ ఈఎస్‌ 300హెచ్‌పై) నుంచి రూ.20.8లక్షల వరకు (ఎస్‌యూవీ ఎల్‌ఎక్స్‌ 500డీపై) ఉంది.

  • కియా ఇండియా తన వాహనాల ధరలను రూ.4.48 లక్షల వరకు తగ్గిస్తున్నట్టు సోమవారం వెల్లడించింది. ధరల తగ్గింపు రూ.48,513 (కారెన్స్‌పై) నుంచి రూ.4,48,542 (కార్నివాల్‌) మధ్య ఉంది. ఈ నెల 22 నుంచి తగ్గించిన ధరలు అమల్లోకి వస్తాయని కంపెనీ పేర్కొంది.

  • జేఎ్‌సడబ్ల్యూ ఎంజీ మోటార్‌ ఇండియా తన మోడల్‌ ధరలను రూ.54,000 నుంచి రూ.3.04 లక్షల వరకు తగ్గించింది. ఈ ధరలు ఈనెల 7వ తేదీ నుంచే అమల్లోకి వచ్చినట్టు తెలిపింది.


  • నిస్సాన్‌ మోటార్‌ తన కాంపాక్ట్‌ ఎస్‌యూవీ మాగ్నైట్‌ ధరలను రూ.లక్ష వరకు తగ్గించింది. సవరించిన ధరలు ఈ నెల 22న లేదా తర్వాత చేసే అన్ని డెలివరీలకు వర్తిస్తాయని పేర్కొంది. కొత్త ధరలతో తక్షణమే కస్టమర్లు బుకింగ్‌ చేసుకోవచ్చని తెలిపింది.

  • ఆడి ఇండియా తన వాహనాల ధరలను రూ.2.6 లక్షల నుంచి రూ.7.8 లక్షలకు పైగా తగ్గించినట్టు వెల్లడించింది. కొత్త ధరల ప్రకారం.. కంపెనీ ఎంట్రీ ఎస్‌యూవీ క్యూ3 ధర రూ.43.07 లక్షల నుంచి ప్రారంభమౌతుంది. ఇంతకు ముందు దీని ధర రూ.46.14 లక్షలు ఉండేది. అలాగే టాప్‌ టాప్‌ ఎండ్‌ ఎస్‌యూవీ క్యూ8 ప్రారంభ ధర ఇంతకు ముందు రూ.1.18 కోట్లు ఉండగా.. ఇప్పుడు రూ.1.1 కోట్ల నుంచి ప్రారంభమవుతుంది. ఎస్‌యూవీ మోడళ్లయిన క్యూ5, క్యూ7, సెడాన్‌ మోడళ్లయిన ఏ4, ఏ6 ధరలను కూడా కంపెనీ తగ్గించింది.

  • స్కోడా ఇండియా తన కార్ల ధరలను రూ.3.3 లక్షల వరకు తగ్గిస్తున్నట్టు పేర్కొంది. ఈ నెల 21కన్నా ముందు బుకింగ్‌ చేసుకునే వారికి రూ.2.5 లక్షల వరకు డిస్కౌంట్లతో కంపెనీ అదనంగా ప్రత్యేక పండగ ఆఫర్‌ను కూడా ప్రకటించింది. ప్రస్తుతం స్కోడా కొడియాక్‌ ధరలు రూ.46.89 లక్షల (ఎక్స్‌షోరూమ్‌) నుంచి ప్రారంభమవుతున్నాయి. దీని ధర రూ.3.3 లక్షల వరకు తగ్గనుంది. స్కోడా కుశాక్‌ ప్రస్తుత ధర రూ.10.99 లక్షలుండగా.. రూ.66 వేల వరకు తగ్గనుంది. దీనిపై పరిమిత కాల డిస్కౌంట్‌ ఆఫర్‌ ఈ నెల 21 దాకా రూ.2.5 లక్ష వరకు ఉంటుంది. స్కోడా స్లావియా రూ.10.49 లక్షల నుంచి ప్రారంభమవుతుండగా.. దీని ధర రూ.63వేల వరకు తగ్గనుంది. డిస్కౌంట్‌ ఆఫర్‌ రూ.1.2 లక్షల వరకు ఉంది.


ఇవి కూడా చదవండి..

ఉప రాష్ట్రపతి ఎన్నికలో తొలి ఓటు వేసేది ఎవరంటే..

రేపే ఉపరాష్ట్రపతి ఎన్నిక

For More National News And Telugu News

Updated Date - Sep 09 , 2025 | 03:39 AM