Share News

PM Modi Invites Ukraine: జెలెన్‌స్కీని భారత్‌కు ఆహ్వానించిన మోదీ

ABN , Publish Date - Aug 25 , 2025 | 02:35 AM

భారతదేశానికి రావాలని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీని ప్రధాని మోదీ ఆహ్వానించారు. భారత్‌లో ఉక్రెయిన్‌ రాయబారి అలెగ్జాండర్‌ పొలిష్చుక్‌ తాజాగా ఈ విషయాన్ని వెల్లడించారు. ..

PM Modi Invites Ukraine: జెలెన్‌స్కీని భారత్‌కు ఆహ్వానించిన మోదీ

  • ఉక్రెయిన్‌ అధ్యక్షుడి భారత పర్యటన తేదీ ఖరారు కాలేదు

  • ఆ దేశ రాయబారి వెల్లడి

న్యూఢిల్లీ, ఆగస్టు 24: భారతదేశానికి రావాలని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీని ప్రధాని మోదీ ఆహ్వానించారు. భారత్‌లో ఉక్రెయిన్‌ రాయబారి అలెగ్జాండర్‌ పొలిష్చుక్‌ తాజాగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఉక్రెయిన్‌ జాతీయ పతాక దినోత్సవం సందర్భంగా శనివారం ఢిల్లీలో ఒక ఆంగ్ల వార్తాసంస్థతో ఆయన మాట్లాడుతూ జెలెన్‌స్కీ రాక కోసం ఇరుదేశాల అధికారులు పనిచేస్తున్నారని చెప్పారు. ‘జెలెన్‌స్కీ భారత్‌కు వస్తారని మేం ఆశిస్తున్నాం. మన ద్వైపాక్షిక సంబంధాల్లో ఇదొక గొప్ప కార్యం కానుంది. తగిన తేదీకి అంగీకరించేందుకు మేం ప్రయత్నిస్తున్నాం’ అన్నారు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ముగించడంలో భారత్‌ మరింత క్రియాశీలక పాత్ర పోషించాలని ఆయన కోరారు. రష్యాతో భారత్‌కు ఉన్న సుదీర్ఘ సంబంధాల దృష్ట్యా.. శాంతి చర్చల్లో భారత్‌ను కీలక పాత్రధారిగా తాము భావిస్తున్నామన్నారు. శాంతి, కాల్పుల విరమణను సమర్థిస్తున్న మోదీని ఆయన ప్రశంసించారు. భారత్‌ తటస్థమైనది కాదని, శాంతి, దౌత్యం, రాజకీయ చర్చలను అది దృఢంగా సమర్థిస్తోందని అన్నారు.


ఇవి కూడా చదవండి..

మరాఠా రిజర్వేషన్‌పై ఆఖరి పోరాటం.. మనోజ్ జారంగే పిలుపు

రాహుల్ ఓటర్ అధికార్ యాత్రలో జోష్.. హాజరుకానున్న ప్రియాంక

రాహుల్ యాత్రలో మళ్లీ అపశృతి

For More National News And Telugu News

Updated Date - Aug 25 , 2025 | 02:35 AM